Telugu

‘బాహుబలి’ ఫార్ములాతో ‘జనతా గ్యారేజ్’

‘దర్శకధీరుడు’ రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమాకు ఇచ్చిన ప్రమోషన్స్ టాలీవుడ్ లో ఒక వినూత్నమైన ఒరవడిని సృష్టించింది. ‘బాహుబలి’ సినిమా ప్రధాన తారాగణం పుట్టినరోజు సందర్భంలో ప్రతి ఒక్కరి లుక్ లను విడుదల చేసి, సినిమాకు మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అప్పటివరకు ఒక్క హీరోల పుట్టినరోజులకు మాత్రమే ఇలా పోస్టర్స్ ను విడుదల చేసే సందర్భాలు ఉన్నాయి. కానీ, ‘బాహుబలి’ సినిమాకు మాత్రం సినిమాలోని ప్రధాన తారాగణం లుక్స్ ను వారి వారి పుట్టినరోజుల సందర్భంగా విడుదల చేసారు.

ADVERTISEMENT

తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘జనతా గ్యారేజ్’ చిత్ర యూనిట్ కూడా ఇదే రకమైన ఫార్ములాను ఫాలో అవుతోంది. చిత్ర కధానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు పోస్టర్స్ ను విడుదల చేసి, అభిమానులను ఉత్తేజపరిచిన ‘జనతా గ్యారేజ్’ సినిమా యూనిట్, తాజాగా శనివారం నాడు మలయాళ హీరో మోహన్ లాల్ పుట్టినరోజును పురస్కరించుకుని మరో పోస్టర్ ను విడుదల చేసారు.

సింపుల్ లుక్ లో మోహన్ లాల్ పోస్టర్ అదిరిపోయేలా ఉండడంతో ‘జనతా గ్యారేజ్’పై అంచనాలు మరింతగా రెట్టింపు అవుతున్నాయి. గ్యాంగ్ తో కూడిన మోహన్ లాల్ లుక్ ను అభిమానుల కోసం మలయాళ భాషలో కూడా చిత్ర యూనిట్ అందించింది. చూడబోతుంటే ‘జనతా గ్యారేజ్’తో జూనియర్ ఎన్టీఆర్ ఒక మాంచి కమర్షియల్ హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా కనపడుతున్నాడని సినీ వర్గీయులు అంచనా వేస్తున్నారు.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

Jailer 2: Why Anirudh Failing Rajinikanth This Time?

Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is gearing up for a…

19 minutes ago

Toxic OTT Locked: Can Yash Still Recover One Last Time?

Toxic was supposed to be the biggest and most ambitious pan-India film from Kannada. Instead,…

39 minutes ago