వీడియో వైరల్ : డబ్బుల దొంగతనం చేసిన కోతి!

Monkey stealing moneyప్రస్తుత కాలంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. బహుశా ఆ కోవలోనే మరో వింత జరిగిందేమో అనిపించే విధంగా ఆంధ్రప్రదేశ్, గుంటూరులో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. గుంటూరులోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించిన కోతి దాదాపు 10 వేల రూపాయల కట్టను ఎత్తుకుపోయింది. ఇదంతా సదరు నగల దుకాణంలోని సీసీ కెమెరాలలో రికార్డు అయ్యి, ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ADVERTISEMENT

నగల దుకాణంలో ఓనర్ కూర్చునే చైర్ లో దాదాపు 20 నిముషాల పాటు కూర్చున్న కోతి, తర్వాత క్యాష్ డెస్క్ లాగి, అందులో ఉన్న 100 రూపాయల బండల్ ను తన నోటికి కరిపించుకుంది. ఇంతలో షాపులోని వర్కర్ చూడడంతో సదరు క్యాష్ కట్టను పట్టుకుని పరుగులెత్తింది కోతి. దాని వెనుకే పరిగెత్తినా లాభం లేకపోయింది. చూడడానికి కాస్త హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ… దానికి సంబంధించిన వీడియో సర్క్యులేట్ అవుతోంది.

సాధారణంగా దేవాలయాల వద్ద ప్రజల నుండి ఏదొకటి లాక్కుంటూ ఉంటాయి కోతులు. కానీ, ఇదేదో హైటెక్ కోతి మాదిరి, ఓనర్ లేని సమయంలో చక్కగా షాపులోకి వచ్చి, క్యాష్ డెస్క్ లాగి ఓ కట్ట పట్టుకుపోవడం విశేషం. గతంలో ఇలాంటి ఘటన ముంబై జరిగినట్లుగా తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories