డేట్ల పంచాయితీ కాదు.. కంటెంట్ సరిగ్గా ఇవ్వండి!

The Paradise and Adarsha Kutumbam updates

త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న విడుదల కానుంది. నాని ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న రానుంది. రెండు సినిమాల మధ్య కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది.

అయితే ‘ది ప్యారడైజ్’ వారం వాయిదా పడి, అక్టోబర్ 2కు వస్తుందనే ప్రచారం ఒక్కసారిగా మొదలైంది. అంటే ‘ఆదర్శ కుటుంబం’ ముందుగా ప్రకటించిన తేదీకి రాలేకపోతుందనే మాట.

ADVERTISEMENT

ఈ వార్త మొదలైన వెంటనే వెంకటేష్ సినిమా గురించి నిర్మాత నాగ వంశీ ట్వీట్ చేశారు. వాయిదా ప్రచారంపై నేరుగా స్పందించకుండా, తమ ‘AK 47’ అక్టోబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉందని, ఇక ప్రమోషనల్ బ్లాస్ట్ మొదలవుతుందని చెప్పారు.

కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట మరోలా ఉంది. త్రివిక్రమ్, వెంకటేష్ సినిమా నిజంగానే వాయిదా పడుతోందని చెబుతున్నారు. నాగ వంశీ చేసిన ట్వీట్ ప్రస్తుతానికి ఒక ఫార్మాలిటీ మాత్రమేనని, తర్వాత ‘ది ప్యారడైజ్’ టీమ్ కోరడంతో తేదీ ఇచ్చామని చెప్పి, దాన్ని గుడ్ విల్ గా చూపించే అవకాశం ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్.

అయితే ప్రేక్షకుల ఆలోచన ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

‘ది ప్యారడైజ్’ ఒక వారం ముందు వస్తుందా, తర్వాత వస్తుందా అన్నది పెద్ద విషయం కాదు. ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2న వస్తుందా, నెల ఆలస్యంగా వస్తుందా అన్నది కూడా పట్టించుకునే పరిస్థితి లేదు.

ఈ రెండు సినిమాలకు వారం లేదా నెల ఆలస్యమైతే తీవ్రంగా నిరాశపడిపోయే ప్రత్యేకమైన ఫాన్స్ కూడా లేరు. ఇదే అసలు రిటాలిటీ.

ఇప్పటి ప్రేక్షకులు కోరుకుంటున్నది ఒక్కటే. సినిమా ఎప్పుడు విడుదల చేసినా సరే, మంచి కంటెంట్ తో రావాలి. అనవసరంగా హైప్ పెంచి, చివరకు యావరేజ్ లేదా బాడ్ కంటెంట్ ను వారి ముందుకు తీసుకురావద్దు.

‘ఆదర్శ కుటుంబం’ అయినా, ‘ది ప్యారడైజ్’ అయినా డేట్ కంటే కంటెంట్ ముఖ్యం.

విడుదల తేదీ మారితే ప్రేక్షకులు క్షమిస్తారు. సినిమా నిరాశపరిస్తే మాత్రం వారి జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉంటుంది.

ADVERTISEMENT
Latest Stories