అడివి శేష్ తన మొదటి ఇండిపెండెంట్ ఫిలిం “కర్మ” మొదలుకొని మొన్న వచ్చిన “మేజర్” వరకు అందరూ కొత్త హీరోయిన్లతోనే చేశాడు. మొదటిసారి ఓ సీనియర్ & ప్రూవెన్ యాక్టర్ మృణాల్ తో కలిసి “డెకాయిట్” చేశాడు. ఆ ఎఫెక్ట్ శేష్ పై కాస్త గట్టిగానే పడింది.
“కిస్” నుండి “మేజర్” వరకు శేష్ సినిమాల్లో హీరోయిన్లను గమనిస్తే.. కిస్ లో ప్రియా బెనర్జీ, క్షణంలో అదా శర్మ, అమీతుమీలో ఈషా రెబ్బా, గూఢచారిలో శోభిత ధూళిపాళ, ఎవరులో రెజీనా, మేజర్ లో సాయి మంజ్రేకర్, హిట్2లో మీనాక్షి చౌదరి. ఇలా అందరూ ఆల్మోస్ట్ శేష్ కంటే జూనియర్స్ లేదా కొత్త హీరోయిన్లు. అందువల్ల వాళ్ళెవ్వరూ శేష్ ని స్క్రీన్ ప్రెజన్స్ లో కానీ, యాక్టింగ్ లో కానీ డామినేట్ చేయకుండా జాగ్రత్తపడ్డాడు.
అయితే.. డెకాయిట్ సినిమాకి వచ్చేసరికి మృణాల్ నటిగా చాలా సన్నివేశాల్లో శేష్ ని డామినేట్ చేసింది. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ముందు శేష్ ఆనడానికి కాస్త ఇబ్బందిపడ్డాడు. దాంతో ఆమెకు సెకండ్ హీరో క్రెడిట్ ఇచ్చినప్పటికీ.. సినిమా చూసినవాళ్ళందరూ శేష్ కంటే మృణాల్ బాగా నటించిందని కొనియాడుతుండడం అనేది నటుడిగా శేష్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది.
నిజానికి మృణాల్ బదులు శృతి చేయాల్సిన రోల్ అది. అయితే శృతి ఈస్థాయిలో నటించి మెప్పించేదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాకపోతే..శృతిని ఈతరహా యాక్షన్ కమ్ ఎమోషనల్ రోల్లో చూడ్డానికి కొత్తగా ఉండేది. మృణాల్ మాత్రం అందర్నీ తన పెర్ఫార్మెన్స్ తో డామినేట్ చేసేసి.. సినిమాకి వచ్చిన ఆ కాస్త బజ్ ని కూడా తన ఖాతాలో జమ చేసుకుంది.
ఈ దెబ్బకి శేష్ మళ్లీ కాస్త సీనియర్ లేదా ప్రూవెన్ హీరోయిన్స్ తో నటించడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించడం ఖాయం.




