ధోని కొత్త పాత్రకు కారణం ఇదేనా…?

2024 ఐపిఎల్ ప్రారంభానికి ముందు ధోని తన అఫిషియల్ X అకౌంట్ నుండి చేసిన ట్వీట్ అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. “కాన్ నాట్ వెయిట్ టు గెట్ ఇంటూ ద న్యూ రోల్” అనే ట్వీట్ ను ఎం ఎస్ ధోని తన X పేజీ లో ట్వీట్ చేసారు. అయితే ఆ కొత్త పాత్ర ఏంటి అనేది క్రికెట్ అభిమానులను ఆలోచింపజేయగా, కొందరు ధోని ఈ సీజన్లో ఓపెనర్ అవతారం ఎత్తనున్నట్టు అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. అయితే ఇన్ని రోజులకు ఆ సస్పెన్స్ ని వీడేలా అఫిషియల్ ఐపీఎల్ సోషల్ మీడియా హ్యాండిల్ లో సిఎస్కె కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అంటూ పోస్ట్ చేసారు.దీని బట్టి అప్పుడు ధోని చెప్పిన కొత్త పాత్ర తాను కేవలం వికెట్ కీపర్ బాట్స్మన్ గా ఆడటమే అని అర్థంచేసుకోవచ్చు.

చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజ్ కు మొట్ట మొదటి ఐపీఎల్ సీజన్ 2008 నుండే ధోని సారధిగా వ్యవహరిస్తున్నాడు.మధ్యలో 2022 సీజన్ కు ఆ పగ్గాలను జడేజా చేతికి ఇవ్వగా..అతను విఫలం అవ్వటం తో తిరిగి ధోని కె కెప్టెన్సీ ను కట్టబెట్టింది మానేజ్మెంట్. అయితే ధోని కేవలం వికెట్కీపర్ బాట్స్మన్ గా నే కాక తన పదునైన నిర్ణయాలతో మరియు మైండ్ గేమ్స్ తో సిఎస్కె జట్టును ఐదు సార్లు ఛాంపియన్స్ గా మలిచారు.ఇప్పటికే ఇదే ధోని లాస్ట్ సీసన్ అంటూ పలు వార్తలు రాగా..నేడు తాను టీం కు కెప్టెన్ కాదు అనే విషయం ఫ్యాన్స్ ను ఆవేదన లో కి నెట్టేస్తుంది. ఒక పక్క ముంబై ఇండియన్స్ టీం కూడా రోహిత్ శర్మ ఉండగా హార్దిక్ పాండ్య కు కెప్టెన్సీ పగ్గాలను అందచేశారు. దీనితో ఇండియన్ అభిమానులు విరాట్,రోహిత్,ధోని… ఎండ్ అఫ్ అన్ ఎరా అంటూ తమ బాధ ను పంచుకుంటున్నారు.

ADVERTISEMENT

ఒక పక్క ముంబై టీం కూడా ఇదే పని చేయటం తో, సీనియర్స్ ఆధ్వర్యం లో టీం ను లీడ్ చెయ్యబోతున్న ఫ్యూచర్ స్టార్స్ గా ఈ ప్లేయర్స్ ను భావించవచ్చు. రోహిత్ ఆధ్వర్యం లో హార్దిక్, ధోని ఆధ్వర్యం లో రుతురాజ్,ఇలా మెల్ల మెల్లగా టీమ్స్ అన్ని కొత్త జెనరేషన్ ప్లేయర్స్ పై మక్కువ చూపిస్తున్నాయి అనటం లో ఎటు వంటి సంకోచమూ లేదు. అయితే హార్దిక్ గుజరాత్ టీం నుండి ముంబై కి రావటం తో, గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం శుబ్మాన్ గిల్ ను తమ కొత్త కెప్టెన్ గా వెల్లడించేసారు. ఇక అదే దారిలో చెన్నై యాజమాన్యం కూడా కొత్త జనరేషన్ ప్లేయర్ అయినా రుతురాజ్ కు కెప్టెన్సీ అప్పగించారు. ఏది ఏమైనా రేపటి రోజున ఐపీఎల్ లో అయినా ఇండియన్ క్రికెట్ టీం కు అయినా కెప్టెన్సీ పగ్గాలను అందుకోగలిగే సామర్ధ్యం ఉన్న ఆటగాళ్లకు ఫ్రాంచైజీలు కెప్టెన్సీ ను అందచెయ్యటం లో భవిష్యత్ కోసం వారు అడుగులు వేస్తున్నట్టు అర్ధమవుతుంది. ఇక శుబ్మాన్ గిల్ మరియు రుతురాజ్ తమ డెబ్యూట్ కెప్టెన్సీ తో ఈ సీసన్ లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి. ఇద్దరికి అల్ ది బెస్ట్.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

స్థానికంలో మచ్చుకి కొన్ని ఆలోచనలు, అభిప్రాయాలు…

స్థానిక సంస్థల ఎన్నికలలో సీట్ల సర్దుబాట్ల విషయంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల మద్దతుదారులు చేస్తున్న వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా…

7 minutes ago

దసరాకు కాదు.. సంక్రాంతికి రిలీజ్‌!

ఇది సినిమా రిలీజ్‌.. వాయిదా పడటం గురించి కాదు. మాజీ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కొత్త పార్టీ రిలీజ్‌…

8 minutes ago