Telugu

పలకరింపుల వరకైతే పర్వాలేదు కానీ ముద్రలు వద్దు!

ఒక వ్యక్తి, సంస్థ లేదా రాజకీయ పార్టీ విజయాలు లేదా పతనం గురించి వివరించాలంటే కనీసం రెండు మూడు వాఖ్యాలు అవసరం. కానీ ఒక్కోసారి ఆ ఆవసరం కూడా ఉండదు. ఒక పేరు చెప్పగానే కళ్ళ ముందు సినిమాలా ఆ స్టోరీ మెదులుతుంది. అటువంటి ఒక పేరే ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి!

కాపుల హక్కుల కోసం దశాబ్దాల పాటు పోరాడి ఎంతో గౌరవం సంపాదించుకున్న ‘ముద్రగడ పద్మనాభం’ చివరికి ‘ముద్రగడ పద్మనాభ రెడ్డి’గా ఎలా మారారో అందరికీ తెలుసు.

ADVERTISEMENT

కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఒక్కరే తమతో ఉంటే చాలని అర్జునుడు అనుకున్నాడు. కానీ అపారమైన సైన్యం తమకు దక్కిందని, ఇక తమని పాండవులు ఓడించలేరని దుర్యోధనుడు సంతోషపడ్డాడు. కానీ చివరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు.

ముద్రగడ పద్మనాభ రెడ్డి విషయంలో ఈ కధ రివర్స్ అయ్యింది. కాపు సామాజికవర్గంపై మంచి పట్టున్న శ్రీకృష్ణుడు వంటి ముద్రగడ పద్మనాభం తమ వైపు ఉంటే చాలు. టీడీపి, జనసేన, బిజేపీ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించవచ్చని జగన్‌ అనుకున్నారు.

టీడీపితో పొత్తుపెట్టుకున్నందుకు జనసేన పార్టీని, పిఠాపురంలో దాని అధినేత పవన్ కళ్యాణ్‌ని ఓడించినా టీడీపిని అధికారంలోకి రాకుండా అడ్డుకోగలమని అనుకున్నారు.

కానీ దేవుడి స్క్రిప్ట్ వేరేగా ఉంది. రాజకీయాల నుంచి సగౌరవంగా తప్పుకోవలసిన తరుణంలో జగన్‌తో చేతులు కలిపినందుకు ముద్రగడ నవ్వుల పాలయ్యారు. జీవితమంతా కాపుల కోసం పోరాడిన ఆయన చివరికి ‘రెడ్డి’గా మారారు. అందుకే సత్సాంగత్యం, దుష్ట సాంగత్యం అన్నారు పెద్దలు.

ఇంతకీ విషయం ఏమిటంటే, అయన టీడీపి ఎమ్మెల్యే చిన్న రాజప్పతో సమావేశమయ్యారు. ఇదివరకు ముద్రగడ ఆసుపత్రిలో ఉన్నప్పుడు చిన్న రాజప్ప వచ్చి పరామర్శించారు. కనుక ఇప్పుడు మర్యాదపూర్వకంగా చిన్న రాజప్పని కలిసి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ముద్రగడ నేడు ఆయన క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలిశారు. చిన్న రాజప్ప ఆయనను సాదరంగా ఆహ్వానించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని పంపించారు. సుమారు అర్ధ గంటసేపు వారి భేటీ అయినట్లు సమాచారం.

ఈ భేటీ కేవలం కృతజ్ఞతలు తెలుపుకునేందుకే అయితే పర్వాలేదు. కానీ టీడీపిలో ముద్రగడ ప్రవేశం కోసమైతేనే ఇబ్బంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

F-1 Visa Scam: Agent Cancels Appointment

An F-1 visa applicant recently revealed how their agent tried to scam them. The applicant…

24 minutes ago

Atlee’s Oscar Promise: Raaka Inviting Unnecessary Trolls?

Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, was released in theatres…

1 hour ago