Telugu

పాపం ముద్రగడకు ఈ ఉపశమనం అవసరమే

కాపుల నాయకుడుగా ఎంతో గౌరవం, గుర్తింపు సంపాదించుకున్న పెద్దాయన ముద్రగడ పద్మనాభం…. జగన్‌ పుణ్యమాని ముద్రగడ పద్మనాభ ‘రెడ్డి’గా పేరు మార్చుకోవలసి వచ్చింది. ఆయన పోయిపోయి జగన్‌తో చేతులు కలపడంతో జనసేనలో ఉన్న కూతురు క్రాంతికి కూడా దూరం కాక తప్పలేదు. జగన్‌ పుణ్యామాని ఎన్నికల సమయంలో తండ్రీ, కూతుర్లు పరస్పరం విమర్శించుకోక తప్పలేదు. ఆ కారణంగా వారి మద్య ఇంకా దూరం పెరిగింది.

మలి దశలో ఇంతకంటే మనోవేదన, అవమానం ఇంకేముంటాయి? కానీ ఇవన్నీ స్వయంకృతమే కనుక భరించక తప్పడం లేదు.

ADVERTISEMENT

ఇటీవల ఆయన ఆరోగ్యం దెబ్బ తిన్నప్పుడు హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నారు. కానీ వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్ళక తప్పలేదు.

ఆ సమయంలో జగన్‌ తన కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తానన్నారని కానీ తానే వద్దన్నాని ముద్రగడ పద్మనాభ రెడ్డి ఓ లేఖ విడుదల చేశారు. ఆ సమయంలో జగన్‌ తనకు ఎప్పుడు ఏ సాయం అవసరమైన చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పేవారని ఆ లేఖలో పేర్కొన్నారు.

అలాగే పలువురు వైసీపీ నేతలు, పలువురు ప్రముఖులు తనకు అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం కోసం పలువురు ఆలయాలలో పూజలు కూడా చేయించారని, ఇందుకు పేరుపేరునా అందరికీ శిరస్సు వంచి పాదాలకు ప్రమాణం చేస్తున్నానని ముద్రగడ పద్మనాభ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

వైసీపీ అధినేత జగన్‌తో ఒక్కసారి చేతులు కలిపితే ఆయన జీవితంలో ఇన్ని మార్పులు రావడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కదా? మలిదశలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న ఆయనకు వైసీపీ అధినేత జగన్‌ ఈ మాత్రం ఉపశమనం కల్పించడం అవసరమే… వాలంటీర్లను వాడుకొని వదిలేసినట్లు ముద్రగడని వదిలేయలేదు. కనుక చాలా అదృష్టం కూడా!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi New Release Date: But Why Don’t Fans Believe It?

Fauzi is now reportedly targeting a March 18, 2027 release. The film was originally scheduled…

1 hour ago

Desi Man Arrested at US Airport: H-1B Revoked

The bodycam footage of an arrest has gone viral on Instagram. The footage shows police…

2 hours ago