‘బిగ్ బాస్’ షోలో స్పెషల్ అట్రాక్షన్స్?

Actress-Mumaith-Khan-appears-before-SIT-in-drug-caseవారాంతంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సందడి మినహా పెద్దగా టాక్ ఆఫ్ ది టౌన్ కానటువంటి ‘బిగ్ బాస్’ షోలో ఇప్పటికే జ్యోతి ఎలిమినేట్ కాగా, సంపూ తనంతట తానుగా బయటకు వచ్చేసాడు. తాజాగా బిగ్ బాస్ అనుమతితో ముమైత్ ఖాన్ సిట్ విచారణకు హాజరైంది. స్వయంగా బిగ్ బాస్ ప్రతినిధితో హాజరైన ముమైత్ ఖాన్ ను, విచారణ ముగిసిన తర్వాత మళ్ళీ అదే ప్రతినిధి బిగ్ బాస్ హౌస్ లో దింపనున్నారు. అయితే ఒక్క వారంలో జరిగిన ఈ పరిణామాలతో పాటు, బిగ్ బాస్ హౌస్ లో ఓ హాట్ క్యారెక్టర్ మిస్సయ్యిందన్న టాక్ తో నిర్వాహకులు కొంతమంది హాట్ బ్యూటీలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ‘జబర్దస్త్’ యాంకర్ అనసూయను ‘వైల్డ్ కార్డ్’ ఎంట్రీగా పంపించాలని చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో మరికొందరి హాట్ బ్యూటీల కోసం సంప్రదింపులు చేస్తున్నారట. ఒక్కసారి ఈ చర్చలు సఫలం కాగానే, జూనియర్ ఎన్టీఆర్ సమక్షంలో బిగ్ బాస్ హౌస్ లోకి మరికొంతమంది బ్యూటీలను పంపించబోతున్నారని సమాచారం. కనీసం ఒక్కరి నుండి ఇద్దరి వరకు ఈ సంఖ్య ఉండవచ్చని, వీలైతే ఈ వారంలోనే వీరి ఎంట్రీ ఉంటుందని టాక్. తెలుగు తెరపై గ్లామర్ రోల్స్ ను పోషించిన యువ హీరోయిన్లతో ఈ చర్చలు జరుగుతున్నట్లుగా ట్రేడ్ టాక్. ఇవి సఫలమైతే ‘బిగ్ బాస్’కు కాస్త కళాకాంతులు వచ్చినట్లే భావించవచ్చు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories