
తాజాగా ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అప్డేట్స్ అంటూ కొన్ని రూమర్స్ తెగ వైరల్ అవుతున్నాయి .అవి ఎంత మేరకు నిజమో తెలియదు కానీ, వచ్చే ప్రతి వార్త లో ను ముంబై ఇండియన్స్ జట్టు ప్రస్తావన రాకమానట్లేదు.
మరి ఇంత గందరగోళంగా ఉన్న ముంబై జట్టు స్థితి, వచ్చే ఐపీఎల్ 2025 సీజన్ కు ఎవర్ని రెటైన్ చేసుకోవాలో.. ఎవర్ని వదిలెయ్యాలో ఫ్రాంజైజీలు ఇప్పటికే ఒక ఆలోచనకు వచ్చి ఉంటారు.
ఇషాన్, తిలక్, వధేరా, నమన్ వంటి యువ భారత ఆటగాళ్లు ఇప్పటికే తమ ఆట స్థాయి ఏంటనేది ఐపీఎల్ వేదికగా చూపించుకున్నారు. ఇప్పుడు మెగా ఆక్షన్ అంటే ప్రస్తుతం టీం లో ఉండే 22 ఆటగాళ్ల నుండి కేవలం ఒక పరిమితి వరకే ఆటగాళ్లను రెటైన్ చేసుకోగలరు.
ఇంత మంది యువ ఆటగాళ్లను జల్లెడ పట్టి తమ ఫ్రాంచైజ్ తీసుకుంటే, ఇప్పుడు అందర్నీ వదిలేయాల్సిన సమయం ఆసన్నమయింది. రోహిత్, సూర్య, బుమ్రా, హార్దిక్, డేవిడ్, కొయెట్జీ వంటి అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ఆటగాళ్లు టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇప్పుడు ఇంత మంది ఆటగాళ్ల మధ్య జట్టు ఫ్రాంచైజ్ కేవలం 3 ఇండియన్స్ -1 విదేశీ (లేదా) 2- ఇండియన్స్, 2-విదేశీ ఆటగాళ్లను మాత్రమే రెటైన్ చేసుకోగలరు. భారత సామర్ధ్యం మరియు విదేశీ అనుభవం రెండు జంటగా ఉన్న జట్టు ముంబై ఇండియన్స్.
ఐపీఎల్ 2024 లో సరైన నడవడిక లేక వారు వరుసగా మ్యాచ్లలో విఫలమయ్యారు. కెప్టెన్సీ వివాదం, ఫాన్స్ హడావుడి, కలిసిరాని కాలం ఇలా అన్ని గత సీజన్లో వారికి అడ్డు గోడల్లాగే నిలబడ్డాయి.
రోహిత్, బుమ్రా, సూర్యా, హార్దిక్ వంటి 4గురు అత్యంత కీలకమైన ఆటగాళ్లలో కేవలం ముగ్గురిని మాత్రమే రెటైన్ చేసుకోగలిగే అవకాశం.ప్రస్తుత వార్తా కథనాల బట్టి తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ టీం నుండి బయటకు వెళ్ళటానికి సర్వం సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
ఇక అలాగే, సూర్య మరియు బుమ్రా సైతం జట్టు యాజమాన్యం పట్ల అసంతృప్తి గా ఉన్నారంటూ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజా కథనాలు చూస్తుంటే అసలు ముంబై జట్టు లో ఎవరు ఉండనున్నారో… ఎవరు వేలంలో పాల్గొనబోతున్నారో అనేది పెద్ద ఆసక్తిగా మారింది.
Mithun Chakraborty is playing villain role in Rajinikanth's Jailer 2. But before signing the film,…
Success may have changed Vijay Deverakonda’s life, but it hasn’t changed the way he thinks.…