
“మహేష్ తో కలిసి సినిమా ఎప్పుడో చేయాల్సి ఉందని, ఇంతకాలానికి నెరవేరినందుకు సంతోషంగా ఉందని, మహేష్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతమని, ఈ సినిమాలో మహేష్ ను కొత్త అవతారంలో ఖచ్చితంగా చూస్తారని” చెప్పిన మాటలు ప్రిన్స్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా షూటింగ్ జరుగుతుండడంతో, అసలేం జరుగుతోంది? అన్న దానిపై ప్రిన్స్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
దీంతో తాజాగా దర్శకుడు మురుగదాస్ చెప్పిన మాటలు కాస్త ఊరటను కలిగిస్తున్నాయి. ప్రిన్స్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా, ‘పెళ్లిచూపులు’ ఫేం ప్రియదర్శి మహేష్ కు స్నేహితుడిగా, సినిమాలో ఒక కమెడియన్ గా నటిస్తున్నాడు. ఇక, విలన్ రోల్ లో ప్రముఖ దర్శకుడు సూర్య కనులవిందు చేస్తుండగా, ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ లు చిత్ర నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…