ఒక్క ‘దేవర’ కే పట్టిన చిక్కా..?

Anirudh Ravichander

ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే బేధాభిప్రాయాలేమి లేకుండా భారత సినీ ఇండస్ట్రీ మొత్తం పాన్ ఇండియా సంగీత దర్శకుడు అనగానే వినపడుతున్న మొట్ట మొదటి పేరు “అనిరుధ్ రవిచందర్”. తాను ఒప్పుకున్న సినిమాలకు అతను ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆ రేంజ్ లో ఉంటుంది మరి.

సినిమా సంగీత బాధ్యతలు అతని చేతిలోకి వెళ్లిందంటే మేకర్స్ అంత ఇక మ్యూజిక్ గురించి ఆందోళన చెందే పని లేకుండా చేస్తున్నారు. కేవలం సినిమా థియేటర్ లో మనం సినిమా చూస్తున్నప్పుడు వచ్చే పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఏకంగా సినిమా కే హైలైట్ గా నిలుస్తున్నాయి అనటంలో ఏమాత్రం సందేహమే లేదు.

ADVERTISEMENT

ఇక ఆన్-స్క్రీన్ మ్యూజిక్ తోనే కాక, తను అభిమానులకు ఇచ్చే అసలైన కిక్, సినిమా ప్రీ-రిలీజ్ వేడుక లో తన లైవ్ పెర్ఫామెన్స్ తో సినిమా ను భారీగా ప్రమోట్ చేస్తున్నాయి. అలాగే అనిరుధ్ ఇచ్చే ఈ లైవ్ షో లతో మూవీ మీద కూడా అంచనాలను ఒక రేంజ్లో పెంచుతున్నాడు.

జైలర్, విక్రమ్, లియో, జవాన్ వంటి అగ్ర హీరోలు నటించిన సినిమాలలో ఆ హీరో నటన, స్టోరీ కూడా బావున్నప్పటికీ, సగటు సినీ అభిమాని హాల్ నుండి బయటకు వచ్చే సమయానికి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ ఏ హైలైట్ అంటున్నారు అంటే అదే అనిరుధ్ సత్తా ఏంటో చెబుతుంది.

అలాగే, లేటెస్ట్ సెన్సేషన్ దేవర కు కూడా సంగీతం అనిరుధ్ ఇస్తున్నారు అని ఫాన్స్ కు తెలియగానే, అందరు ప్రీ-రిలీజ్ వేడుక లో అనిరుధ్ ఇచ్చే లైవ్ షో కోసమే కళ్ళు కాయలు కాచే లాగా ఎదురుచూసారు. తీరా వేడుక రోజు, తారక్ అభిమానులు సంద్రమై వచ్చేసరికి, ఈవెంట్ ఏ రద్దయింది. దీనితో అభిమానులంతా నిరాశ గా ఇంటికెళ్లారు.

ప్రీ-రిలీజ్ ఎటూ జరగలేదు, సినిమా సక్సెస్ మీట్ లో అయినా అనిరుధ్ షో చూద్దాం అనుకున్న అభిమానులకి మరల ఒక షాక్ ఇచ్చారు మేకర్స్. దసరా పండుగ కారణంగా అవుట్-డోర్ గ్రౌండ్లు ఖాళీ లేకపోవటంతో మీడియా తో సమావేశమై సక్సెస్ మీట్ ను కూడా చిన్నగానే పూర్తిచేసింది చిత్ర యూనిట్.

అయితే ఈ వారం లో చోటు చేసుకున్న “వెట్టయాన్” ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో అనిరుధ్ షో కు వచ్చిన రెస్పాన్స్ తారక్ అభిమానులను మళ్ళీ బాధపడేలా చేసింది. ఇలా అందరి హీరో అభిమానులు అనిరుధ్ మ్యూజిక్ షో ను ఎంజాయ్ చేస్తుంటే, తారక్ అభిమానులు మటికీ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు. ఏ సినిమాకు లేని చిక్కు, కేవలం “దేవర కే పట్టిందా” అంటూ సరిపెట్టుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories