Telugu

నాదెండ్ల ప్రశ్నలకు వైసీపీ వద్ద సమాధానాలు ఉన్నాయా?

రెండు రోజుల వైసీపీ ప్లీనరి అట్టహాసంగా మొదలై, వేదిక మీద అందరూ జబ్బలు చరుచుకోవడంతో ముగిసింది. ఈ ప్లీనరీని వైసీపీ నేతలు నభూతో నభవిష్యతి అని వర్ణిస్తుంటే, జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ చాలా నిశితంగా విమర్శించారు.

సిఎం జగన్మోహన్ రెడ్డికి, ఆయన భజనలో తరించిపోయిన మంత్రులకు నాదెండ్ల కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. వాటికి వారు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలిగితే వారు చెప్పుకొంటున్నట్లు వారి పాలన అద్భుతంగా సాగుతోందని అందరూ అంగీకరించవచ్చు.

ADVERTISEMENT

విజయవాడలో జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీ సిద్దాంతాలు, ప్రణాళికలు అన్నీ జగన్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఆయన మనసులో ఏమనిపిస్తే అదే పార్టీ సిద్దాంతం.. అదే అందరికీ వేదవాక్కు. అంతకు మించి వైసీపీలో మరేమీ లేదు. రెండురోజుల ప్లీనరీలో తమ ప్రభుత్వం గొప్పదనం గురించి అందరూ బాగానే భుజాలు చరుచుకొన్నారు. అయితే కొన్ని ప్రశ్నలకు తప్పక సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది.

1. మీ ప్రభుత్వం రూ.1.25 లక్షల కోట్లతో రైతులను ఆదుకొందని చెప్పారు. అది నిజమే అయితే రాష్ట్రంలో 3,000 మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొన్నారు?వారి కుటుంబాలను మీ ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదు? వారందరికీ రైతు భరోసా ఎందుకు ఇవ్వాలేదు?

2. ప్రతీ అక్కా, చెల్లెమ్మ బ్యాంక్ ఖాతాలో రూ.37,000 చొప్పున మీరు జమా చేశామని చెప్పారు. కానీ మళ్ళీ దానిలో నుంచి రూ.2,000 కోట్లు ఎందుకు వెనక్కి తీసుకొన్నారు?

3. ఉద్యోగులు పొదుపు చేసుకొన్న జీపీఎఫ్ ఖాతాలలో నుంచి మీ ప్రభుత్వం రూ.800 కోట్లు ఎందుకు వెనక్కు తీసుకొంది?దానిపై సిఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?

4. కోనసీమ అల్లర్ల గురించి పదేపదే మాట్లాడిన సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరిగితే వారి కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? ఆయన ఇంటిపై దాడిని మీరు ఎందుకు ఖండించలేదు?

5. మీ ప్రభుత్వం ఓట్ల కోసం సమాజాన్ని కులాలవారీగా, మతాల వారీగా చీల్చుతుండటాన్ని మీరు ఏవిదంగా సమర్ధించుకోగలరు?

6. సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో పర్యటించినప్పుడు దుకాణాలన్నీ మూసివేయించి, రోడ్లపై బ్యారీకేడ్లు పెట్టి అప్రకటిత కర్ఫ్యూ ఎందుకు విధించవలసి వచ్చింది?

7. మీ పులివెందుల నియోజకవర్గంలోనే 13 మంది రైతులు ఆర్ధిక సమస్యలు భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నమాట వాస్తవమా కాదా?

8. మీ సంక్షేమ పధకాలే మీకు శ్రీరామరక్ష అని నమ్ముతున్నారు. మీ ప్రభుత్వం 95 శాతం హామీలను అమలుచేసిందని ప్లీనరీలో చెప్పుకొన్నారు. కనుక ఇన్ని పధకాలు, హామీలు అమలుచేసారు గనుక దమ్ముంటే 2023 మార్చి లేదా ఏప్రిల్ ప్రభుత్వం రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళగలరా?

9. ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇచ్చి రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పితే చివరికి ఈ దుస్థితికి తీసుకువచ్చారు. అయినా 175 సీట్లు వస్తాయని ఏవిదంగా చెపుతున్నారు?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Prabhas’ Re-Release $13.5: Why US Tickets So Expensive?

Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…

1 hour ago

Karthik Subbaraj’s Dorothy: Will Netflix Release Spark Fresh Controversy?

Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…

2 hours ago