
[m9ad]
ఈ క్రమంలో సోషల్ మీడియాలో బాలయ్య అభిమానులు మాత్రం నాగబాబుకు ఇంత అహంకారం పనికిరాదని కామెంట్ చేస్తున్నారు. అయితే మెగా అభిమానులు మాత్రం గతంలో పవన్ కళ్యాణ్ ఎవరో తనకు తెలీదన్న బాలయ్య కామెంట్ కు ఇది చెంప పెట్టు వంటిదని చెప్పుకొస్తున్నారు. రెండు వైపులా వారు దీనిగురించి కొట్టుకుంటుండగానే నాగబాబు మరోసారి ఇంకో వీడియో విడుదల చేశాడు. బాలయ్య ఎవరో తెలీదు అనడమే తప్పే అని, ఆయన గొప్ప కమెడియన్ అని అన్నారు.
తన నటనలో ప్రతి అణువణువునా హాస్యం ఉంటుందని ఎద్దేవా చేసినట్టే చేసి చివర్లో ఇంకో సీనియర్ నటుడు బాలకృష్ణ ఫోటో చూపించి తనకు నందమూరి బాలకృష్ణ అంటే ఎవరో తెలీదు అని చెప్పకనే చెప్పారు. దీనితో సోషల్ మీడియా మరింత వేడెక్కింది. అయితే బాలయ్య మీద నాగబాబు కామెంట్లు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నవే అని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. కమ్మ, కాపు కులాల మధ్య ఎప్పుడూ ఉండే తరతమ్యాన్ని పెద్దదిగా చేసి, కాపులు జనసేన వైపు మరింత సంఘటితం చేసే ప్రయత్నమిది అని అనుమానిస్తున్నారు.
గతంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన చింతమనేని ప్రభాకర్ ను కూడా ఇదే ఉద్దేశంతో టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్. చింతమనేని కూడా ఆవేశపరుడు కాబట్టి గట్టిగా స్పందిస్తారని తద్వారా కాగల కార్యం నెరవేరుతుందని భావించారు. అయితే ఎలాగో ఆయన దాని మీద గట్టిగా స్పందించలేదు. ఇప్పుడు ఆవేశపరుడిగా పేరు గాంచిన బాలయ్యను కూడా ఇదే ఉద్దేశంతో టార్గెట్ చేసినట్టు టీడీపీ వారి అనుమానం. దీనికి బాలయ్య ఎలా స్పందిస్తారో చూడాలి. జనసేనకు అవకాశం ఇస్తారా?
Nagarjuna’s much-awaited 100th film, King100, has reportedly locked its digital streaming deal with SonyLIV. The…
గతంలో ప్రభుత్వాలు, పోలీసులు మావోయిస్టులను అడవులు, తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చేవారు. ఇప్పుడు సిఎం చంద్రబాబు నాయుడు…