
అంబటి రాంబాబు అదృష్టం కొద్దీ మంత్రి అయ్యారు. మాజీ కూడా అయ్యారు. ఆయన విషయంలో టీడీపి శ్రేణులు అసహనం బయటపడింది అని చెప్పుకున్నప్పటికీ, వారి అత్యుత్సాహం కూడా అయనకు వరంగా మారింది. సత్తెనపల్లి హీరోని రాత్రికి రాత్రి కాపుజాతి నాయకుడుగా మార్చేసింది.
ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శ, రాష్ట్రంలో కాపులకు ఆయనే ‘ఐకాన్’ అని వైసీపీ చాటింపు వేయడం కూడా ఆయన కోరని, ఊహించని వరాలే!
కానీ రాష్ట్రంలో కాపులు ఆయనని తమ ‘ఐకాన్’గా అంగీకరిస్తున్నారా?
ఇదివరకు కాపుల ప్రస్తావన వచ్చినప్పుడు మొట్ట మొదట ముద్రగడ పద్మనాభం పేరే వినిపించేది. కానీ జగన్ పుణ్యామాని అయన వెళ్ళి రెడ్లలో కలిసిపోవడంతో ఇలాంటి సమయంలో మాట్లాడలేని దుస్థితి.
ఎలాగూ కాపుల ప్రయోజనాలపై చర్చ మొదలైంది కనుక వారి సమాజాజిక వర్గానికి చెందిన జనసేన నేత నాగబాబు ఓ సోషల్ మీడియాలో ఓ వీడియో సందేశం పోస్ట్ చేశారు.
కాపులకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీగా గుర్తింపు పొందిన జనసేన 2024 ఎన్నికలలో అన్ని కులాలను కలుపుకుపోవాలనే ఉద్దేశ్యంతో కులాన్ని బట్టి కాక నియోజకవర్గంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవిస్తూ ఇతర కులాలకు చెందిన నేతలకు టికెట్స్ ఇచ్చి గెలిపించుకున్న విషయాన్ని నాగబాబు ఆ వీడియో ద్వారా అందరికీ మరోమారు గుర్తు చేశారు.
అయితే కొత్తగా కాపు నాయకులమని తమని తాము ప్రమోట్ చేసుకుంటున్న అంబటి రాంబాబు, పేర్ని నాని ఆ పార్టీకి మద్దతు ఇస్తున్న కాపు నేతలను నాగబాబు అడిగిన ప్రశ్నలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి.
1. అంబటి రాంబాబు కాపుల ‘ఐకాన్’ వంగవీటి రాధనా?
2. అసలు అంబటి రాంబాబు పక్కన వంగవీటి బొమ్మ పెట్టాలనే దిక్కుమాలిన ఐడియా ఇచ్చినవాడు ఎవడు? ముందు వాడిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మంచిది.
3. కాపు నేస్తం పధకానికి కూడా జగన్ తన తండ్రి పేరు తగిలించినప్పుడు ఇప్పుడు కాపులమని గొంతు చించుకుంటున్న అంబటి రాంబాబు, పేర్ని నాని ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? కోడి రామూర్తినాయుడు, సీకే నాయుడు, పుంజల శివశంకర్ వంటి ప్రముఖులు ఉన్నారు. వారిని కాదని మీ తండ్రి పేరు ఎందుకు పెడుతున్నావు? అడగలేదు. ఎందుకు?
4. కాపుల మీద జగన్‌కి నిజంగా అంత ప్రేముంటే వంగవీటి రాధని పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారు?అప్పుడు మీ నోళ్ళు ఎందుకు పెగలలేదు?
5. రాజంపేట ఎంపీ సీటుని బలిజ నాయకుడు సాయి ప్రతాప్‌కి ఇవ్వకుండా మిథున్ రెడ్డికి కట్టబెడితే ఈ టైగర్లు అంబటి, పేర్ని ఎందుకు నోరు మూసుకున్నారు?
6. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుంటే, ఆయనని ఓడించేందుకు మిథున్ రెడ్డిని జగన్ దించారు. కానీ పవన్ కళ్యాణ్‌ని మీ చేతే బూతులు తిట్టించేవారు. మిథున్ రెడ్డి చేత ఎందుకు తిట్టించలేదు? మిథున్ రెడ్డిపై ఈగ వాలకుండా కాపాడుకుంటున్న జగన్ మిమ్మల్ని బలి చేస్తున్నారనే విషయం కూడా ఇంతవరకు మీ ఇద్దరికీ అర్థం కాలేదు. అర్ధమయ్యి ఉండి ఉంటె మీరిద్దరూ ఆ పార్టీలోనే ఉండేవారు కారు.
7. అంబటి రాంబాబు ముఖ్యమంత్రి బూతులు తిడితే జైల్లో పెట్టకుండా ముద్దు పెట్టుకుంటారా?
నాగబాబు ఏమన్నారో అయన మాటల్లోనే…
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…