పిల్లల ప్లాన్ గురించి నాగచైతన్య ఏమన్నాడంటే

Naga Chaitanya - Akkineni - Samantha Akkineniసహజంగా మన సమాజంలో పెళ్లి అవ్వగానే వచ్చే తరువాతి ప్రశ్న పిల్లలు ఎప్పుడని? సెలెబ్రిటీస్ అయినా ఈ ప్రశ్న తప్పదు. నాగచైతన్య, సమంతల పెళ్లి అయ్యి రెండేళ్ళు అయ్యింది. ఈ ప్రశ్న మాములే కదా. ఇటీవలే నాగచైతన్య టాలీవుడ్ కు వచ్చి పదేళ్లు అయ్యింది. పిల్లల గురించి అడగగా… “పిల్లలంటే ప్యూరిటీ. నాకు పిల్లలంటే చాలా ఇష్టం,” అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అమ్మానాన్న అడుగుతుంటారా? పిల్లలెప్పుడూ అని? ఒత్తిడిలాంటిది ఏమైనా? అని అడగగా ఆసక్తికరంగా స్పందించారు నాగచైతన్య.

“హ.. హ.. హ.. అమ్మానాన్న సరదాగా డైలాగులు వేస్తూనే ఉంటారు. మనవళ్లు కావాలని కచ్చితంగా కోరుకుంటారు కదా. అడిగినప్పుడల్లా నవ్వేసి ఊరుకోవడమే,” అని నాగచైతన్య చెప్పారు. దీనిబట్టి ఇప్పట్లో పిల్లల ప్లాన్ ఇప్పట్లో లేదనే అర్ధం చేసుకోవచ్చు. సమంత ఇప్పటికే తాను తల్లి అయిన వెంటనే కేరీర్ లో బ్రేక్ తీసుకుని తల్లితనాన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంటే వారిద్దరూ పిల్లలకు మరికొంత టైం తీసుకుందాం అనుకుంటున్నారన్నమాట.

ADVERTISEMENT

నాగచైతన్య ప్రస్తుతం వెంకీ మామ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అక్టోబర్ 25న దీపావళి సందర్భంగా ఆ సినిమా విడుదల అవుతుంది. మరోవైపు సమంత ఓ బేబీ సక్సెస్ అయ్యాకా ఆమె ఇంకో సినిమా సైన్ చెయ్యలేదు. ఇప్పటికి తన చేతిలో శర్వానంద్ తమిళ రీమేక్ 96 మాత్రమే ఉంది. 96 రీమేక్ ప్రాజెక్టు క్రిస్మస్ సందర్భంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదికి సమంతకి ఉన్న ఏకైక రిలీజ్ ఇదే. పెళ్లి అయ్యాకా సమంత కమర్షియల్ సినిమాలు తగ్గించేసింది. వెరైటీ సబ్జక్ట్స్ కోసం తన టైం తాను తీసుకుంటుంది.

ADVERTISEMENT
Latest Stories