బ్యాక్‌లాగ్ అవుట్… నెక్స్ట్ స్టెప్ ఏంటి?

Naga Shaurya at movie event after Bad Boy Karthik release

నాగశౌర్య అంటే గుడ్ లుకింగ్ హీరో అని మాత్రమే కాదు, మంచి కథలు ఎంచుకుంటాడు అనేది ఇమేజ్ ఉండేది. “చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడడు రామయ్య” వంటి సినిమాలతో యంగ్ హీరోల్లో కంటెంట్ తో ఎదుగుతున్న హీరో అనిపించుకున్నాడు.

కట్ చేస్తే.. మాస్ హీరో ఇమేజ్ కోసం తాపత్రయపడి చేసిన “జాదూగాడు” డిజాస్టర్ అవ్వగా, ఆ తర్వాత మళ్లీ తన ట్రాక్ లో చేసిన “కల్యాణ వైభోగమే, ఒక మనసు, జ్యో అచ్యుతానంద, కథలో రాజకుమారి” లాంటి సినిమాలతో వరుస పరాజయాలు చవిచూసి కాస్త ఢీలాపడ్డాడు.

ADVERTISEMENT

ఆ తర్వాత “ఛలో” సినిమాతో మళ్లీ కెరీర్ కి ఊపొచ్చింది. అయితే దాన్ని కంటిన్యూ చేయలకపోయాడు. “కణం, అమ్మమ్మగారిల్లు, నర్తనశాల, అశ్వద్ధామ, వరుడు కావలెను, లక్ష్య, కృష్ణ వృంద విహారి, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, రంగబలి” సినిమాలతో మళ్లీ చతికిలపడ్డాడు.

ముఖ్యంగా “రంగబలి” సినిమా తర్వాత కొంచం గ్యాప్ తీసుకుందామనుకున్నాడు. కానీ.. ఎప్పుడో చేసిన “బ్యాడ్ బాయ్ కార్తీక్” అనే బ్యాక్ లాగ్ సినిమా బయటికి వచ్చింది. మొదట ఈ సినిమాని పట్టించుకోని శౌర్య, రిలీజ్ టైంలో మాత్రం నిర్మాతల కోసం ట్రైలర్ లాంచ్ & ప్రీరిలీజ్ ఈవెంట్లకి హాజరయ్యాడు. అయితే.. సినిమా అందరూ ఊహించినట్లుగానే డిజాస్టర్ గా నిలిచింది.

మరి శౌర్య తదుపరి సినిమా ఏంటి? స్వీయ నిర్మాణంలో ఏదైనా సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడా? లేక ఏదైనా ప్రాజెక్ట్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉందా అనేది తెలియాల్సి ఉంది. కానీ.. శౌర్య లాంటి యంగ్ హీరోలు ఇలా బ్రేక్ తీసుకోవడం అనేది అంత మంచిది కాదు.

ADVERTISEMENT
Latest Stories