
తమ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ నిత్యం ట్వీట్లు చేస్తుంటే, ఎవరో ఒకరు స్పందించాలి కాబట్టి ఆనాడు నేను ఆ విధంగా స్పందించాల్సి వచ్చింది. ఒకటికి పదిసార్లు మాట్లాడితే అబద్దాలు కూడా నిజమనుకునే ప్రమాదం ఉంది కనుక, వాటిని ఖండిస్తూ తానూ ఆ వ్యాఖ్యలు చేశాను, అయితే కాస్త హార్ష్ గా కాకుండా, మర్యాదపూర్వకంగా చెప్పుంటే బాగుండేదని తన వ్యాఖ్యలలోని ఆంతర్యాన్ని అంగీకరించారు. అయితే అంత హార్ష్ గా మాట్లాడినా వారికి ఎక్కలేదంటూ మరో వ్యాఖ్య చేయడం కొసమెరుపు.
ఆ ఇద్దరితో తనకు ఎన్నడు విభేదాలు లేవని, ఇక ముందు కూడా ఉండబోవని, వారేమీ అన్నా కూడా పట్టించుకోబోనని ఈ సందర్భంగా నాగబాబు స్పష్టం చేసారు. ఓ దినపత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో సదరు విశేషాలను చెప్పుకొచ్చారు నాగబాబు. తన కుమారుడు వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న గమ్యం పట్ల, చేస్తోన్న సినిమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయగా, వినూత్నమైన సినిమాలను చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
We have now arrived at a point where the Telugu audience are simply not stepping…
Tamil Nadu politics has taken a dramatic turn after a major split surfaced inside All…