
మెగా స్టార్ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగబాబు అన్న చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ మాదిరి సూపర్ స్టార్ కాలేకపోయారు. మెగా స్టార్ చిరు రాక్షసుడు సినిమాతో 1986 లో సినీ కెరీర్ ను ప్రారంభించిన నాగబాబు నాటి నుంచి నేటి వరకు ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు గా మాత్రమే రాణించగలిగారు.
ఇక తన కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక సినీ అరంగేట్రం సైతం చిరు ఛరిష్మాతోనే ఆరభమయ్యింది. అయితే ఇలా తన కుటుంబం నుంచి టాలీవుడ్ లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో నాగబాబు మాత్రం ‘మెగా బ్రదర్’ గానే మిగిలిపోయారు.
ఇక ఇటు పొలిటికల్ గా చూసుకుంటే తమ్ముడు స్థాపించిన జనసేనలో సభ్యుడిగా చేరిన నాగబాబు 2024 ఎన్నికలలో కూటమి పొద్దులో భాగంగా జనసేన విజయం సాధించి ప్రభుత్వంలో భాగమవ్వడంతో జనసేన ఎమ్మెల్సీ గా శాసన మండలి లో నేడు తన తొలి అడుగు వేశారు.
అయితే అక్కడ అన్న చాటు తమ్ముడిగా అడుగులేసిన నాగబాబు ఇక్కడ తమ్ముడు నాయకత్వంలో ముందుకెళ్లనున్నారు. మరి సినీ ఇండస్ట్రీలో నాగబాబు సాధించుకోలేని స్టార్ డమ్ పొలిటికల్ కెరీర్ లో అందుకుంటారా.? ఆ దిశగా నాగబాబు రాజకీయ అడుగులు వేయగలరా.?
తన ఎమ్మెల్సీ పదవితో మండలిలో జనసేన గొంతు బలంగా వినిపిస్తూ తన రాజకీయ బలాన్ని పెంచుకోగలరా? గతంలో టీడీపీ తో తనకున్న వైరుధ్యాలను నేడు స్నేహ ధర్మంగా మార్చుకుని పసుపు – ఎరుపు జెండాలను కలుపుకుని రాజకీయ అడుగులు ముందుకు వేయగలరా.?
సినీ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ గా మాత్రమే మిగిలిన నాగబాబు రాజకీయ రంగంలో దాన్ని దాటి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకోగలరా.? జనసేన తనకెంత బలమో అన్నదాని కంటే కూడా తానూ జనసేనకు ఎంత అవసరమో అన్న దాని పై నాగబాబు ద్రుష్టి పెట్టగలరా.? లేక అక్కడ అన్న చాటు తమ్ముడిగా ఇక్కడ తమ్ముడి చాటు అన్నగా మిగిలిపోతారా.?
Over the last few years, South films, starting from Baahubali in 2015, have undoubtedly created…
An IndiGo flight travelling from Navi Mumbai to Mangalore was delayed by more than an…