నాగార్జున నిర్ణయాలు ఫ్యాన్స్ కు మింగుడుపడటం లేదు

Nagarjuna Akkineni - Praveen Sattaru Movie2008లో వచ్చిన కింగ్ సినిమా తరువాత హిట్ కోసం నాగార్జున 2014లో వచ్చిన మనం దాకా ఆగాల్సివచ్చింది. మనం తరువాతి రెండు సినిమాలు – సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి కూడా పెద్ద హిట్లు అయ్యాయి. ఊపిరి విడుదలైన 2016 తరువాత నాగార్జునకు హిట్ అనేది లేదు. తాజాగా ఆయన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తి చేశారు.

ADVERTISEMENT

ఈరోజు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ ముహూర్తం చేసుకున్నారు. అయితే నాగార్జున ఎంచుకుంటున్న సినిమాలతో అక్కినేని అభిమానులు హ్యాపీగా లేరు. యాక్షన్ సినిమాలు చెయ్యడం వల్ల డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు అనే పేరు వచ్చినా అవి ఎంతవరకు థియేటర్లలో రాణిస్తాయో అనుమానమే.

మనం, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి సినిమాలతో ప్రేక్షకులు నాగార్జున నుండి ఏం కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పేశారు. అయితే నాగార్జున మాత్రం వేరే ట్రాక్ లోనే వెళ్తున్నారని ఫ్యాన్స్ అసహనంతో ఉన్నారు. వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఆ రోజున నాగార్జున నిర్ణయం తప్పా ఒప్పా అనేది అర్ధం అయిపోతుంది. మరోవైపు… నాగార్జున బాలీవుడ్ లో బ్రహ్మాస్త్ర అనే సినిమా తో కమ్ బ్యాక్ చేస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ నటిస్తున్న ఆ చిత్రంలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆ సినిమాకు నాగార్జున షూట్ పూర్తి చేశారు.

ADVERTISEMENT
Latest Stories