
రాష్ట్ర విభజన జరిగినా తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్‌లోనే స్థిరపడింది. అలా స్థిరపడిన సినీ ప్రముఖులలో పలువురు నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్లు వగైరా నిర్మించారు.
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా హైటెక్ సిటీ సమీపంలో గల తమ్మిడికుంట చెరువు పక్కనే ‘ఎన్ కన్వెన్షన్’ నిర్మించారు.
కానీ తమ్మిడికుంట చెరువులో కొంత భాగం ఆక్రమించి దానిని నిర్మించారంటూ కేసీఆర్ హయాంలోనే జీహెచ్‌ఎంసీ అధికారులు ‘ఎన్ కన్వెన్షన్’ ప్రహరీగోడ కూల్చివేతకు సిద్దమయ్యారు.
అప్పుడు అందరూ దాన్ని సినీ పరిశ్రమపై కక్ష సాధింపుగానే చూశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. జిహెచ్‌ఎంసి అధికారులు మళ్ళీ దాని జోలికి రాలేదు.
సిఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ‘హైడ్రా సంస్థ’ను ఏర్పాటు చేశారు. అది ‘ఎన్ కన్వెన్షన్’ను పూర్తిగా కూల్చివేసింది. అప్పుడు నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆ కేసు, ప్రస్తావన రాలేదు!
బుధవారం తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంలో నాగార్జున కూడా పాల్గొనడం విశేషం. ఆ తర్వాత ఏం జరిగిందో ఆయన స్వయంగా ఆ సభలో చెప్పారు.
“ఆ రోజు ‘ఎన్ కన్వెన్షన్’ కూల్చి వేస్తున్నప్పుడు నేను తీవ్ర ఆందోళన చెందాను. అప్పుడు నేను వేరే ఆలోచనతో వెళ్ళి హైడ్రా కమీషనర్ రంగనాథ్‌ను కలిశాను. కానీ ఆయన నాకు చాలా ఓపికగా అన్ని విషయాలు వివరించారు. ఆయన చెప్పింది విన్నాక నేను నా రెండెకరాలు ప్రభుత్వానికి వ్రాసి ఇచ్చేశాను.
ఎందుకంటే, ఈ భూమి మీద ఎవరూ శాశ్వితంగా ఉండిపోరు. అలాగని మనమేమీ డెబిట్ కార్డ్ పట్టుకొని పైకి వెళ్ళలేము. కనుక హైదరాబాద్ అభివృద్ధికి నా వంతుగా ఈ మాత్రం చేయడం గొప్ప విషయంగా భావించడం లేదు.
నేను విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి అందమైన చెరువులను చూసి, మన హైదరాబాద్ నగరంలో చెరువులు ఈవిధంగా ఎందుకు ఉండవని బాధపడేవాడిని.
ముఖ్యంగా ఈ తమ్మిడికుంట చెరువు ఒకప్పుడు చెత్తచెదారం, వ్యర్థాలు, మురికి నీటితో నిండి ఉండేది. దీనిని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినందుకు హైడ్రా కమీషనర్ రంగనాథ్‌ను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను,” అని అక్కినేని నాగార్జున అన్నారు.
అక్కినేని నాగార్జున కాస్త ఆలస్యంగానైనా వాస్తవం అంగీకరించి ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈ కార్యక్రమానికి ఆయనకు రిటర్న్ గిఫ్టుగా ఈ ఆహ్వానం, ఈ గౌరవం లభించాయి. ఆయన కూడా ప్రజల ముందు ధైర్యంగా నిలబడి ఈవిధంగా మాట్లాడగలిగారు.
హైడ్రా ధనవంతులు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వారి జోలికి పోకుండా నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్ళు, దుకాణాలు కూల్చి వేస్తుందని తరచూ ఆరోపణలు వస్తూనే ఉంటాయి.
అటువంటి శక్తివంతులైన రాజకీయ నాయకులతో పోలిస్తే నాగార్జున ‘మధ్యతరగతి స్థాయి’కి చెందినవారే అనుకోవచ్చు. కనుక ఈ త్యాగం చేయక తప్పలేదేమో? కానీ ఈ త్యాగంతో ఆయన ఆస్తులు ఏమీ తగ్గిపోవు. పైగా సమాజంలో అలాగే ప్రభుత్వంలో కూడా ఆయన గౌరవం పెరుగుతుంది.
ఏది ఏమైనప్పటికీ, ఇంతకాలం తీవ్ర అప్రదిష్ట, విమర్శలకు గురవుతున్న హైడ్రా, దాని కమీషనర్ రంగనాథ్‌కు తొలిసారిగా ఇలా సభాముఖంగా అభినందనలు లభించడం మరో విశేషం. అదీ… ఆయన బాధితుడు నాగార్జున నోట ఈ ప్రశంస ఇంకా గొప్ప విషయమే కదా? విన్ అండ్ విన్ అంటే ఇదే కదా?
Anirudh Ravichander's wedding celebrations in Greece have been creating a lot of buzz. Several videos…
After nine seasons and more than two decades as a pop-culture phenomenon, Koffee with Karan…