Telugu

ఆహా అనిపించిన బాలయ్య అన్ స్టాపబుల్…!

అన్ స్టాపబుల్ షో ముందు వరకు బాలయ్యలో ఉన్న ఒక కోణాన్నే చూసిన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు ఆ నాణంలో ఉన్న మరో కోణాన్ని చూస్తున్నారు. అన్ స్టాపబుల్ అంటూ ఆహాలో వస్తున్న ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బాలయ్య తన వాక్చాతుర్యంతో ఈ షో ను ఇండియాలోనే నడిచే టాక్ షో లలో టాప్ ప్లేసులో ఉంచారు.

ఈ కార్యక్రమం ఇప్పటికే 3 సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకుని 4 వ సీజన్ కు ఈ దసరా పండుగను వేదికగా చేసుకుంది. దసరా పండుగ స్పెషల్ ట్రీట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 4 ట్రైలర్ ను ఆహా టీం బాలయ్యను సూపర్ హీరోగా ఆనిమేటెడ్ ఫామ్ లో ప్రజంట్ చేస్తూ విడుదల చేసింది.

ADVERTISEMENT

ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ తో పాటుగా ఆయన చిన్న కుమార్తె తేజస్విని, దర్శకుడు అను రాఘవ పూడి, నిర్మాత అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తేజస్విని మాట్లాడుతూ నాన్న గారు వ్యాఖ్యాతగా చేస్తున్న ఈ షో ఐఎండిబి వరల్డ్ ర్యాంకింగ్ టాప్ 18 వ స్థానంలో కొనసాగుతుంది అంటూ ఈ షో స్థాయిని వివరించారు.

అలాగే అసలు ఈ టాక్ షో బాలకృష్ణ గారికి సెట్ అవుతుందా లేదా అనే సందేహంలో మేమంతా ఉన్నప్పుడు కచ్చితంగా ఈ షో నేను చేసి తీరుతా అంటూ నాన్న గారు ముందుకొచ్చారు. ఇప్పుడు ఇదే షో తో రెండు తెలుగు ప్రేక్షకులతో పాటుగా దేశం మొత్తం అన్ స్టాపబుల్ షో గురించి మాట్లాడుకునే స్థాయికి తీసుకువచ్చారన్నారు.

ఈ టాక్ షో తో బాలకృష్ణ చేసిన సందడి అంత ఇంత కాదనే చెప్పాలి. అయితే యదన్త తానూ కేవలం నిర్మాత అల్లు అరవింద్ కోసమే ఒప్పుకున్నని, అంతకు ముందు ఆ తరువాత కూడా తనను హోస్ట్ గా చేయమని చాల షోస్ నుండి ఆఫర్ వచ్చిన కూడా తానూ తిరస్కరించడం జరిగిందంటూ బలయ్యాయ్ కూడా ఈ టాక్ షో మీద తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

అయితే అటు రాజకీయ ప్రముఖులతో పాటుగా ఇటు టాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ సెలబ్రేటిస్ కూడా ఈ టాక్ షో కు గెస్టులుగా వచ్చారు. ఇప్పటికే ఈ షో కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలతో పాటుగా రాణా, విజయ్ దేవరకొండ, నాచురల్ స్టార్ నాని, విశ్వక్, సిద్దు, గోపి చంద్ వంటి హీరోలతో పాటుగా దర్శక ధీరుడు రాజమౌళి, సుకుమార్, అనిల్ రవి పూడి, బోయపాటి…వంటి టాప్ దర్శకులు కూడా గెస్టులుగా వచ్చి అలరించారు.

అలాగే సందీప్ వంగా తో పాటుగా యానిమల్ మూవీ ప్రమోషన్ కు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ కూడా అన్ స్టాపబుల్ షో కు ముఖ్య అతిధిగా విచ్చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఇటు రాజకీయాలకు సంబంధించి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా ఒక ఎపిసోడ్ లో సందడి చేసారు.

అయితే గత మూడు సీజన్లో ఈ షో అనుకున్న దానికంటే ఎక్కువ సక్సెస్ ను చూసిందనే చెప్పాలి. ఈ టాక్ షో లో బాలయ్య వచ్చిన అతిధులను తన స్టయిలే లో ప్రశ్నలు అడగడం కానీ, వారి మధ్య జరిగే సరదా సంభాషణ కానీ ఇతర టాక్ షో లతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉండడం ఈ షో సక్సెస్ కు ఒక కారణంగా చెప్పవచ్చు.

అలాగే బాలయ్యను కూడా ఇలా ఇంత సరదా గా ప్రేక్షకులు ఇంతవరకు చూసిందే లేదు. కాబట్టి ఒక్కసారిగా బాలకృష్ణను ఈ యాంగిల్ లో చూడడం కూడా ఈ షో సక్సెస్ కు మరో కారణం. అయితే అన్ స్టాపబుల్ సీజన్ 4 మొదటి ఎపిసోడ్ మెగా స్టార్ చిరుతో ప్రారంభం కానుంది…ఇటు మెగా అటు నందమూరి కాంబినేషన్ బుల్లితెర మీద ఆవిష్కరించబోతున్నది ఆహా అంటూ ఒక వార్త ఇప్పుడు ఈ టాక్ షో కు మరింత హైప్ ను తెచ్చి పెడుతుంది.

మరి ఈ సీజన్ 4 లో ఇంకెంత మంది సెలబ్రేటిస్ తమ అభిప్రాయాలను ఈ టాక్ షో ద్వారా బయటపెట్టబోతున్నారో వేచి చూడాలి. అయితే ఈ నెల 24 నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 4 ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది అంటూ కార్యక్రమ నిర్వాహకులు ప్రకటించారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

విశాఖ మేయర్ పీఠం.. ఆ జనరల్ మహిళ ఎవరు?

విశాఖ మేయర్ పదవిని జనరల్ మహిళకు కేటాయించడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే టీడీపీ నుంచి నందమూరి బాలకృష్ణ…

8 minutes ago

After A Big Break, Vallabhaneni Vamsi Is Back?

Andhra Pradesh politics got largely streamlined after the removal of YCP from power. Usually abusive…

43 minutes ago