షాక్ : బాలయ్య ‘అవతారం’ ఏంటి ఇలా ఉంది?

Nandamuri balakrishna avatar in IIFA Utsavఈవెంట్ ఏదైనా దానికి తగిన విధంగా ఎంజాయ్ చేయాలంటే ఒక్క బాలకృష్ణ తర్వాతే అన్నది సినీ వర్గీయులు చెప్పే మాట. ఈ ఫోటో చూసిన తర్వాత బహుశా వీక్షకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారని చెప్పవచ్చు. ఒక చిన్న పిల్లవాడి మాదిరి బాలయ్య ఎంజాయ్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కళ్ళకు బొమ్మ కళ్ళజోడు పెట్టుకుని, ఎక్కిరిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మరియు వెబ్ మీడియాలో సందడి చేస్తోంది.

ADVERTISEMENT

తొలుత ఈ ఫోటో చూసి షాక్ అవ్వడం నందమూరి నటసింహం అభిమానుల వంతవ్వగా, అయితే ఐఫా ఉత్సవంలో భాగంగా బాలయ్య ఇచ్చిన ఫోజు అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి ఫోజులివ్వడం ఒక్క బాలయ్య వల్లే సాధ్యపడుతుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదేమో!

ADVERTISEMENT
Latest Stories