అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజైతే షాక్ అయ్యే రోజులివి

Nani Reacts To Constant Delays

ఇదివరకు సినిమా ప్రారంభోత్సవం రోజునే.. చాలా నమ్మకంగా రిలీజ్ డేట్ లేదా మంత్ లేదా సీజన్ ప్రకటించేవారు దర్శకనిర్మాతలు. దాన్ని బట్టి ఎగ్జిబిటర్లకి, తోటి నిర్మాతలకు ఒక అంచనా ఉండేది. దాన్ని బట్టి మిగతా సినిమాల రిలీజ్ లు, థియిటర్లు పంచుకోవడం వంటివి జరిగేవి.

అలాంటిది ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుంది అనేది ఆ వారం వరకు కూడా క్లారిటీ ఉండడం లేదు. ఇక కొన్ని పెద్ద సినిమాలైతే.. ఏడాది ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. తర్వాత సింపుల్ గా పోస్ట్ పోన్ చేసేస్తున్నారు.

ADVERTISEMENT

రీసెంట్ గా పెద్ది, ప్యారడైజ్, డ్రాగన్ విషయాల్లో అలాగే జరిగింది. వీటిలో కనీసం ప్యారడైజ్, డ్రాగన్ సినిమాలు తమ సినిమాలు వాయిదా అవ్వడాన్ని ముందే ప్రకటించి, మిగతా సినిమాలకు టైమ్ ఇచ్చారు.

కానీ.. పెద్ది టీమ్ మాత్రం లాస్ట్ మినిట్ వరకు వాళ్ల డిలేని అఫీషియల్ గా అనౌన్స్ చేయకుండా.. మిగతా సినిమాలకి క్లారిటీ ఇవ్వకుండా సమ్మర్ సీజన్ మొత్తాన్ని వేస్ట్ చేసింది.

ఈ విషయమై రీసెంట్ గా ఒక ప్రైవేట్ ఈవెంట్లో నాని మీడియాతో మాట్లాడుతూ.. ఎనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ అయితే ఆశ్చర్యపోయే స్టేజ్ కి చేరుకున్నాం. మేం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో.. ప్యారడైజ్ ని అనుకున్న టైమ్ కి రిలీజ్ చేయడానికి పరుగులు పెడుతున్నాం అని చెప్పుకొచ్చాడు. నాని అన్న మాటలో నిజం లేకపోలేదు. మన హీరోలు మరియు దర్శకనిర్మాతలు కాస్త డిసిప్లేన్ తో రిలీజ్ డేట్స్ ను ప్లాన్ చేస్తే.. ఇండస్ట్రీ కూడా చక్కబడుతుంది. లేదంటే.. అన్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీగానే మిగిలిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories