అవును… ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చెయ్యను… తేల్చి చెప్పిన నాని

nani's tuck jagadish movie press meetరాజమహేంద్రవరం లో జరిగిన టక్ జగదీష్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో నాని నేను ఫ్యాన్స్ ను ఎంకరేజ్ చెయ్యను అని చెప్పారు. ఆయన చెప్పిన ఉద్దేశం వేరేలా ఉండగా… దానిని మాత్రం కొందరు తలపొగరు అని ఇంకోటి అని… రకరకాల భాష్యాలు చెప్పారు. ఆ విషయం గురించి ఒక మీడియా అతను టక్ జగదీష్ మరో ప్రెస్ మీట్ లో నాని మళ్ళీ అడిగారు.

“మనం చెప్పే మాట ఒక్కోసారి వేరేగా వెళ్తుంది. మధ్యలో కొంత మిస్ అవుతుంది. నేను ఎంకరేజ్ చెయ్యను అంటే అభిమానులు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళు సినిమాలు ఎంజాయ్ చెయ్యాలి. వారి అంచనాలకు తగ్గకుండా సినిమాలు చెయ్యడం నా బాధ్యత. వాళ్ళు నన్ను చూసి గర్వపడాలి అనుకుంటా,” అని అన్నారు.

ADVERTISEMENT

“అలా చెయ్యడం నా దృష్టిలో ఎంకరేజ్మెంట్. అయితే కొందరు మాత్రం అభిమానం పేరుతో టైం వేస్ట్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో హీరో కోసమంటూ గొడవపడతారు. కట్ అవుట్లు పెడతారు… పాలాభిషేకాలు చేస్తారు. అది వాళ్ళకు ఎలాగూ ఉపయోగపడదు. నా కెరీర్ చివరి వరకూ దానికి కట్టుబడి ఉంటా,” అని చెప్పుకొచ్చారు.

ఈ వివరణను ఫ్యాన్స్ అంటే తనదృష్టిలో ఉండే నిర్వచనం చెప్పి ముగించారు నాని. “నా దృష్టిలో ఫ్యాన్స్ అంటే నాకు ఏదో చేసేవాళ్ళు కాదు. వాళ్ళ కోసం మనం చెయ్యాలి,” అన్నారు. ఈ వివరణతో ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందని అనుకుందాం. టక్ జగదీష్ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ADVERTISEMENT
Latest Stories