
బెక్కెం వేణుగోపాల్ అనే ఓ చిన్న ప్రొడ్యూసర్ నిర్మించిన ఈ సినిమా కధ నచ్చడంతో, ఏకంగా దిల్ రాజు రంగంలోకి దిగారు. దీంతో అప్పటివరకు ఉన్న చిన్న సినిమా అన్న మార్క్ పోయి, దిల్ రాజు సినిమాగా రిలీజ్ అవుతోంది. దానికి తగిన విధంగానే పబ్లిసిటీ ఎక్కడా తక్కువ కాకుండా జరుగుతోంది. ఇక, టీజర్ విషయానికి వస్తే… ఒకమ్మాయి ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ ను సెట్ చేసుకోవడం, చివరికి ఎవరిని దక్కించుకుంది అన్నదే చిత్ర ప్రధాన కధగా కనపడుతోంది.
ముగ్గురు బాయ్ ఫ్రెండ్స్ గా అశ్విన్, నోయెల్, పార్వతీశం నటించగా, హేబ్బా పటేల్ కు తండ్రిగా రావు రమేష్ నటించారు. అయితే టీజర్ కటింగ్ మాత్రం అంతా హేబ్బా పటేల్ ను దృష్టిలో ఉంచుకునే కట్ చేసారు, ఇందులో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారు. హేబ్బా తర్వాత శేఖర్ చంద్ర అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో ఉన్న ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని చూపించింది. మరి తన బాయ్ ఫ్రెండ్స్ తో ఈ ‘కుమారి’ సృష్టించబోయే హంగామా ఏంటో తెలుసుకోవాలంటే మరికొంత కాలం ఆగాలి మరి!
రాప్తాడు ఘటన పిల్లలలో, ఆ పిల్లల తల్లితండ్రులలో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఒక ప్రభుత్వ పాఠశాలలోకి ఒక వ్యక్తి ప్రమాదకరమైన…
మానవసంబంధాల బలహీనత సమాజాన్ని ఎటువైపుకి తీసుకెళుతుంది అనేదానికి నేడు సమాజంలో జరుగుతున్న ఎన్నో దారుణాలు సజీవ సాక్ష్యాలుగా కళ్ళ ముందు…