ధియేటర్ లో హిలేరియస్ గా పండిన సీన్!

Nannu Dochukunduvate - hilarious sceneసుధీర్ బాబు సొంత ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటు చేసి నిర్మించిన “నన్ను దోచుకుందువటే” సినిమాకు తొలి రోజు యావరేజ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైనింగ్ గా ఉన్న ఈ సినిమా, సెకండాఫ్ లో నెమ్మదించి రొటీన్ గా మారినప్పటికీ, ఓవరాల్ గా ‘ఓకే’ అనిపించుకున్న ఈ సినిమాలో సుధీర్ బాబు చేసిన ఓ సన్నివేశం ధియేటర్లో హిలేరియస్ గా పండుతోంది.

[m9ad]

ADVERTISEMENT

చండశాసనుడైన బాస్ గా నటించిన సుధీర్, హీరోయిన్ నటేష్ చేస్తోన్న షార్ట్ ఫిల్మ్ లో ఓ రోల్ చేసేందుకు సుధీర్ ప్రదర్శించిన వేరియేషన్స్ ధియేటర్లలో నవ్వులు పూయిస్తున్నాయి. ఈ సినిమాలో ఉన్న హైలైట్ సన్నివేశాలలో ఇది ప్రధానమైన సన్నివేశంగా మిగిలింది. దీంతో ఇదే సీన్ ను ఎండ్ కార్డ్స్ లో వేసి మళ్ళీ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్.

అల్లరి పిల్లగా, తన క్యూట్ క్యూట్ నటనతో హీరోయిన్ నభా నటేష్ సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిన ఈ సినిమాకు మౌత్ టాక్ బాగానే ఉండడంతో, తొలిరోజు మంచి వసూళ్ళనే అందిపుచ్చుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా నిలబడుతుందా? లేదా? అన్నది తెలియాలంటే ఈ వీకెండ్ గడవాల్సిందే. వచ్చే వారం బరిలోకి నాగ్ – నానిల ‘దేవదాస్’ రానున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories