టీజర్ టాక్ – కాన్సెప్ట్ కొత్తగా ఉందిగా!

napoleon-teaser- talkఇటీవల విడుదలైన ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ తో నెటిజన్లను ఆకర్షించిన “నెపోలియన్” సినిమా తొలి టీజర్ విడుదలైంది. ‘ఫస్ట్’ టీజర్ తో సినిమాలో ఏదో కొత్తదనం ఉందన్న సంకేతాలను అయితే చిత్ర యూనిట్ అందించింది. తన నీడ కనపడకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేసిన సన్నివేశం కొత్తదనంతో కూడిన ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచింది. ఒక్క సన్నివేశంతో విడుదల చేసిన ఈ టీజర్ వీక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యింది.

టీజర్ ఎండింగ్ లో సిద్ధార్ద్ అందించిన సంగీతం టీజర్ లో మరో హైలైట్ గా చెప్పవచ్చు. ‘ప్రతినిధి’ సినిమాకు రచయితగా పని చేసిన ఆనంద్ రవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఇలాంటి చిన్న సినిమాలు నిముషం పాటు ఉండే టీజర్లలో ప్రేక్షకులను పడేస్తున్నాయి గానీ, రెండున్నర్ర గంటల పాటు ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోతున్నాయి. కానీ ఈ “నెపోలియన్” ఆ జాబితాలో నిలువకుండా ఉంటుందని ఆశిద్దాం.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories