
అయితే టిడిపి కోసం, కార్యకర్తల కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం పాదయాత్ర చేస్తానని నారా లోకేష్ గట్టిగా పట్టుపట్టడంతో అంగీకరించి సాగనంపానని నారా భువనేశ్వరి చెప్పారు. ఆమె అనుమతించినా, ఆ మండుటెండల్లో కొడుకు పాదయాత్ర చేస్తుంటే ఆ తల్లి ప్రాణం ఎంతగా విలవిలలాడిపోయి ఉంటుందో ఊహించుకోవచ్చు.
కానీ తల్లితండ్రుల ఆశీర్వాదాలు, నేతలు, కార్యకర్తల సహాయసహకారాలు, అన్నిటికీ మించి అపూర్వమైన ప్రజాధరణతో నారా లోకేష్ 2600 కిమీ యువగళం పాదయాత్ర పూర్తిచేసి విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. నేడు 199వ రోజున చింతలపూడి నియోజకవర్గంలో బొర్రంపాలెం నుంచి ప్రారంభించి రావికంపాడు, దేవళంపల్లి, గురువాయిగూడెం, రామచంద్రాపురం, జంగారెడ్డి గూడెం వరకు పాదయాత్ర చేయనున్నారు.
ఈ సందర్భంగా టిడిపి నారా భువనేశ్వరిగారు తన కొడుకు నారా లోకేష్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ వీడియోని ఐటిడిపి సోషల్ మీడియాలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో షేర్ చేసింది. దానిలో ఏమన్నారంటే, “నారా లోకేష్ పాదయాత్ర చేస్తానన్నప్పుడు మొదట నేనే వద్దన్నాను. కానీ తాను పట్టుబట్టడంతో సరేనన్నాను. పార్టీ కార్యకర్తలు ఇంతగా శ్రమిస్తుంటే, ప్రజలు, కార్యకర్తలు ఇంతగా ఇబ్బందులు పడుతుంటే వారికి నేనున్నానని భరోసా ఇచ్చేందుకు నారా లోకేష్ పాదయాత్ర చేస్తుండటం నాకు సంతోషం కలిగిస్తోంది.
ఈ పాదయాత్రలో నారా లోకేష్ స్వయంగా అనేక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా ఏనాడూ వెనక్కు తగ్గలేదు. నేను ఫోన్ చేసి అడిగినా తన ఆరోగ్య సమస్యల గురించి చెప్పడు. చాలా బాగున్నాననే చెపుతుంటాడు. నిజానికి పార్టీ కార్యకర్తలు పడే కష్టం ముందు మా అబ్బాయి కష్టమెంత?నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న టిడిపి కార్యకర్తలకి అండగా నారా లోకేష్ నిలబడుతున్నందుకు తల్లిగా నేను చాలా సంతోషిస్తున్నాను. నారా లోకేష్ యువగళం పాదయాత్ర తప్పకుండా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు.
Mythri Movie Makers has announced a special conversation featuring BJP leader K. Annamalai, lawyer and…
The INDIA bloc has turned the controversy over SIR and the Election Commission into a…