
తిరుపతి బహిరంగ సభలో పాల్గొన్న భువనేశ్వరి చంద్రబాబు విజనరీని ప్రజలను గుర్తుచేశారు. అలాగే సభలో కొంతమంది మహిళలు అడిగిన పలు ప్రశ్నలకు తడబడకుండా సమాధానం చెప్పారు. చంద్రబాబుకు పంపే భోజనంలో మీరు విషం కలుతారు అంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలను ఓ మహిళగా మీరు ఎలా తట్టుకొని నిలబడగలిగారు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ అనురాధ అడిగారు.
వైసీపీ నేతల కుసంస్కారం గురించి, మహిళలను కించపరుస్తూ ఆ పార్టీ నేతలు చేసే విమర్శలు ఎలా ఉంటాయో తానూ ఎదుర్కొన్నానని అవన్నీ కూడా మీకు తెలుసనీ,అయితే అటువంటి దిగజారుడు విమర్శలను తానూ పట్టించుకోనని బదులిచ్చారు. ఇక్కడ ఉన్న మహిళలను నేను అడుగుతున్నా మీ కుటుంబంలో ఎవరికైనా భోజనం పంపించేటప్పుడు మీరు ఇలా చేస్తారా? అంటూ నినదించారు.
ఇలా కుటుంబసభ్యులను చంపుకునే సంప్రదాయం, సంస్కారం మా కుటుంబంలో లేదండి. ఇక పనిలేని వారి గురించి కూడా మనం ఎక్కువగా మాట్లాడకూడదు అంటూ నవ్వుతూనే వైసీపీ లీడర్లకు కౌంటర్ వేశారు భువనేశ్వరి. 48 రోజుల నుండి చంద్రబాబుని ఈ ప్రభుత్వం అక్రమంగా జైల్లో నిర్బంధించింది. తన మనవడు దేవాన్ష్ ను చూడకుండా చంద్రబాబు 48 రోజులు జైల్లో గడపడం తనకు భాదేస్తుందన్నారు.
ఇలా భువనేశ్వరి తన ప్రసంగాలతో ఒక పక్క సభలో ఉన్న వారిని ఉత్సాహ పరుస్తూ మరో పక్క కన్నీరు పెట్టిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నారు. అలాగే చంద్రబాబు లేని లోటుని కొంతవరకు భర్తీ చేయగలుగుతున్నారు.న్యాయం గెలవడానికి లేటయినా కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. అలాగే చంద్రబాబు తిరిగి ప్రజల మధ్యకు రావడం రాష్ట్రాభివృద్ధికి రెట్టించిన ఉత్సాహంతో పని చేయడం ఖాయం అంటూ టీడీపీ నేతలలో నమ్మకాన్ని పెంచుతున్నారు.
అలాగే టీడీపీ, జనసేన అధినేతలు తీసుకున్న పొత్తు నిర్ణయానికి ప్రతిస్పందన ఈ రోజు తిరుపతి వేదికగా భువనేశ్వరి సభలో కనిపించింది. ఆ సభ వేదికను భువనేశ్వరి, టీడీపీ నేతలతో పాటుగా తిరుపతి జనసేన నాయకులు కూడా పంచుకోవడంతో, అధినేతల నిర్ణయాల అమలు క్షేత్ర స్థాయిలో ఆమోదంపొందినట్లే అంటున్నారు ఇరు పార్టీల నేతలు. భువనేశ్వరి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్ర క్షేమాన్ని ఆలోచించే వ్యక్తి అని, అందరం కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పై పోరాడదాం అంటూ అటు జన సైనికులకు కూడా పిలుపునిచ్చారు.
భువనేశ్వరి ప్రజల అంచలనాలను అందుకోగలదా? బాబు, లోకేష్ మాదిరి ప్రజాదరణ సాధించగలదా? అంటూ ప్రశ్నించిన వారికీ విమర్శించినా నోటికి తన చేతులతోనే సమాధానం ఇస్తున్నారు నారా భువనేశ్వరి. ఇన్నాళ్లు చంద్రబాబు గుర్తించలేని భువనమ్మ నాయకత్వ లక్షణాలను జగన్ వెలికితెచ్చారు, అలాగే ప్రజలలో నిరూపించారు కూడా. ఈ విషయంలో మాత్రం టీడీపీ నేతలు క్రెడిట్ మొత్తం జగన్ కు ఇవ్వాల్సిందే అంటున్నారు పలువురు రాజకీయ ప్రముఖులు.
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…