
నారా భువనేశ్వరిని చూసి విజయవాడలో టిడిపి నేతలు, కార్యకర్తలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె కూడా తన భర్తకు అండగా నిలబడేందుకు వచ్చిన వారందరినీ చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అరిచేతిని అడ్డంపెట్టి సూర్యకాంతిని ఆపలేమని, అలాగే అక్రమకేసులు బనాయించి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయగలరేమో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆయన చేస్తున్న పోరాటాలను జగన్ ఆపలేరని టిడిపి నేతలు అన్నారు. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జగన్ తన పతనాన్ని మరింత దగ్గరకు తెచ్చుకొన్నాడని టిడిపి నేతలు అంటున్నారు.
టిడిపి యువనేత నారా లోకేష్ని మొదట పోలీసులు అడ్డుకొన్నప్పటికీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడుని కలిసేందుకు అనుమతించడంతో యువగళం పాదయాత్రని నిలిపివేసి రాజోలు నుంచి విజయవాడకు బయలుదేరారు.
పోలీసులు మళ్ళీ ప్లాన్ మార్చి చంద్రబాబు నాయుడుని ఆయన వాహనంలోనే నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు తీసుకువస్తున్నారు. దీంతో ఆయన వెనుక, ముందూ దారిపొడవునా టిడిపి నేతలు, కార్యకర్తలు వాహనాలతో అనుసరించ సాగారు. దారిలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద టిడిపి శ్రేణులు అడ్డుకోవడంతో చంద్రబాబు నాయుడు తన వాహనంలో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట వద్ద జాతీయరహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు టిడిపి శ్రేణులకు నచ్చజెప్పి ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ వారు ససేమిరా అంటుండంతో ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికలలో సిఎం చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలకు హ్యాండ్ ఇచ్చారంటూ వైసీపీ సొంత మీడియా పుంఖానుపుంఖాలుగా కధనాలు ప్రచురిస్తూనే…
Making a commercial action film with a 75-year-old superstar is not an easy task. However,…