
రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఏనాడూ రాజకీయ వేదికల మీద కనపడని, ప్రసంగించని నారా భువనేశ్వరి,నారా బ్రాహ్మణి ని నేడు ప్రజా క్షేత్రంలోకి తీసుకువచ్చిన ఘనత కూడా జగన్ కే దక్కుతుంది.చంద్రబాబు అరెస్టుతో నవంబర్ ఒకటి నుంచి “నిజం గెలవాలి” అనే కార్యక్రమంతో భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టబోతున్నారు.
అదేవిధంగా వ్యాపార కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉండే నారా బ్రాహ్మణి కూడా బాబు అరెస్టుతో తన రాజకీయ ఆలోచనలను తన సామజిక మాధ్యమాల ద్వారా ఎప్పకప్పుడు ప్రజల ముందుంచుతున్నారు. అయితే చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రభుత్వ తీరుని ఎండగడుతూ బ్రాహ్మణి అనేక కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు.
తాజాగా టీడీపీ పార్టీ అందుకున్న “మనం చేద్దాం జగనాసుర దహనం” కార్యక్రమాన్ని విజయవంత చేయడానికి ప్రజలంతా ముందుకు రావాలని బ్రాహ్మణి పిలుపునిచ్చారు. దుర్గా దేవికి మహిషాసురు అనే అసురుడిని అంతం చేయడానికి తొమ్మిది రాత్రుల సమయం పట్టింది. అయినా దుర్గా దేవి తన పోరాటం ఆపకుండా తొమ్మిది రాత్రులు శ్రమించి విజయం సాధించింది.
అదే స్పూర్తితో ఏపీ ప్రజలు కూడా అలుపెరగక కలియుగ అసురుడిని అంతమొందించేంత వరకు పోరాడదాం అంటూ తన X మాధ్యమం ద్వారా ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ జగన్ ను కలియుగ అసురుడితో పోల్చిన బ్రాహ్మణి దుర్గా దేవి స్థానంలో ఏపీ ప్రజలను ఉంచడం ప్రజాస్వామ్యం పట్ల ఆ కుటుంబానికి ఉన్న గౌరవాన్ని సూచిస్తుంది అంటున్నారు టీడీపీ శ్రేణులు.
అలాగే ఆడవారితో, ఆడవారి పై వైసీపీ నేతలు చేస్తున్న నీచ రాజకీయాలు,దిగజారుడు విమర్శలకు కూడా ఆ మహిళా శక్తితోనే సమాధానం చెప్పించుకోవడం, వైసీపీ ప్రభుత్వ దహనానికి సూచికగా భావించాలి అంటూ టీడీపీ మహిళా నేతలు వాపోయారు.ఈ రాష్ట్రానికి పట్టిన కలియుగ అసురుడు జగన్, రాబోయే ఎన్నికలలో ఈ వైసీపీ పార్టీ దహనం తథ్యం, అంతిమ విజయం సాధించేంతవరకూ పోరాటం కొనసాగిద్దాం అంటూ టీడీపీ నేతలు తమ నినాదాలను ప్రజలలోకి తీసుకువెళ్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం పై ఇటువంటి రాజకీయ విమర్శలు చేయడం నారా బ్రాహ్మణి లో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటపెడుతున్నాయి.రాబోయే రోజులలో ఆమె కూడా రాజకీయాలలో అడుగు పెట్టి తన ముద్రను వేస్తుందో లేదో కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటికైతే వైసీపీ ప్రభుత్వం పై బ్రాహ్మణి, భువనేశ్వరిల స్పందన టీడీపీ నేతలకు మంచి బూస్టప్ లా పనిచేస్తుందనే చెప్పాలి.
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…
Tamil actress Divya Bharathi, known for Bachelor and her special appearance in Maharaja, has sparked…