
నాలుగు రోజుల క్రితమే ప్రముఖ జాతీయ మీడియా ‘టైమ్స్ నౌ’ ఏపీలో సర్వే చేసి లోక్‌సభ ఎన్నికలలో వైసీపి 25 స్థానాలకు 24 గెలుచుకోబోతోందని జోస్యం చెప్పింది.
తాజాగా మరో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ కలిసి సర్వే చేసి ఈసారి లోక్‌సభ ఎన్నికలలో వైసీపికి 7 సీట్లు తగ్గుతాయని, వాటిని టిడిపి గెలుచుకోబోతోందని తేల్చి చెప్పింది.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో వైసీపి గ్రాఫ్ వేగంగా పడిపోతోందని పేర్కొంది. అయినప్పటికీ ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే వైసీపికి వైసీపి 15 సీట్లు, టిడిపి 10 సీట్లు గెలుచుకొంటాయని తెలిపింది.
తమ సర్వే ప్రకారం ఏపీలో వైసీపికి 46శాతం, టిడిపికి 42 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా వెనకబడిపోతాయని తెలిపింది. ఆ రెండు పార్టీలు కలిపి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే సాధించే అవకాశం ఉందని తెలిపింది.
ఈ సర్వేల సంగతి ఎలా ఉన్నా, వైసీపి ప్రభుత్వం దుందుడుకుగా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసి జైలుకి పంపించి రాష్ట్రంలో రాజకీయ బలాబలాలను, ప్రజాభిప్రాయాన్ని మార్చేసిందని చెప్పక తప్పదు.
ఒకవేళ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకుండా ఉంటే, టిడిపికి ఇంత సానుభూతి లభించి ఉండేదే కాదు. టిడిపికి ‘ఈ అదనపు సానుభూతి ఓట్లను’ కలిపింది వైసీపి ప్రభుత్వమే కదా?అందుకే తాజా సర్వేలో టిడిపి గ్రాఫ్ పెరిగింది. వైసీపి గ్రాఫ్ తగ్గింది.
ఒకవేళ వైసీపి ప్రభుత్వం చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయకుండా ఉంటే ఆయన, పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఎప్పటిలాగే మోడీ, అమిత్ షాల నిర్ణయం కోసం ఎదురుచూస్తూ, నేటికీ దూరంగా ఉండేవారు. కానీ వారిద్దరినీ కలిపింది కూడా వైసీపి ప్రభుత్వమే కదా?
చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం చాలా తొందరపాటు నిర్ణయమని, దాని వలన ఆయన తాత్కాలికంగా ఇబ్బంది పడుతున్నా అంతిమంగా టిడిపికే మేలు కలుగుతుందని ‘ఎం9 న్యూస్’ ఆయనను అరెస్ట్ చేసినప్పుడే చెప్పింది. అదే నిజం కాబోతోంది.
కనుక చంద్రబాబు నాయుడుని ఇంకా జైల్లో నిర్బందించి ఉంచడం అంటే వైసీపి కొరివితో తల గోక్కొన్నట్లే అవుతుంది. ఈ విషయం వైసీపి ఇప్పటికే గ్రహించి ఉండవచ్చు. బహుశః అందుకే నారా లోకేష్‌ని అరెస్ట్ చేయడానికి ఇప్పుడు తొందరపడటంలేదేమో?
Gujarat Titans defeated Rajasthan Royals by 77 runs in the 52nd match of IPL 2026.…
Suriya’s long-delayed film Karuppu, directed by RJ Balaji, has finally locked its theatrical release date.…