
సిఎం చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లాలోని ఇచ్చాపురం మండలంలోని ఈదుపుపురంలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకాన్ని ప్రారంభించారు. ఈ పధకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందిన గ్రామంలోని ఓ లబ్దిదారుడి వంటింట్లోకి వెళ్ళి గ్యాస్ స్టవ్ వెలిగించి సిఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుల కుటుంబానికి టీ తయారు చేసి ఇచ్చి వారితో కలిసి తాగారు.
ఆయనతో పాటు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, స్థానిక టిడిపి, జనసేన నేతలు లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి సిఎం చంద్రబాబు నాయుడు చేత్తో చేసి ఇచ్చిన టీ తాగారు.
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడూ కూడా ప్రజల మద్యకు వెళ్ళేందుకు ఎన్నడూ జంకలేదు. నిత్యం ప్రజల మద్యే కనిపిస్తుంటారు. ఇందుకు తాజా ఉదాహరణ ఇదే.
చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు వెళ్ళినప్పుడు జగన్‌లాగ పచ్చటి చెట్లు నరికించరు. రోడ్లకిరువైపులా పరదాలు కట్టించుకోరు. నేరుగా ప్రజల మద్యకు వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రజలపై అంత నమ్మకం ఆయనకి! ప్రజలకి కూడా ఆయనపై చాలా నమ్మకం ఉంది కనుకనే 2024 ఎన్నికలలో గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు.
కానీ జగన్ నేటికీ బెంగళూరు, తాడేపల్లి ప్యాలస్ గడప దాటి జనం మద్యకు వచ్చేందుకు భయపడుతూనే ఉన్నారు. వైసీపి నేతలు సరేసరి. ఒకరిద్దరూ సోషల్ మీడియాలో కనిపిస్తుంటారు తప్ప ప్రజల మద్య కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి, అదేవిదంగా టిడిపికి, వైసీపికి మద్య ఉన్న ఈ తేడాయే టిడిపికి ప్రజాధరణ కల్పిస్తోందని చెప్పవచ్చు.
Cricketer Prithvi Shaw and actor Akriti Agarwal are back together just weeks after calling off…
The TDP, Jana Sena and BJP scripted a major victory in the 2024 Andhra Pradesh…