
ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా, “సమాజమే దేవాలయం అని భావించే సంస్కృతిని, దానగుణాన్ని చిన్ననాటి నుండే పిల్లలకు అలవాటు చేయడం తల్లిదండ్రుల ఉత్తమ సంస్కారానికి నిదర్శనం. టీడీపీ అధినేత, @ncbn గారి మనవడు నారా దేవాన్ష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్భంగా తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కార్యక్రమం కోసం ఒకరోజుకు సరిపడా ఖర్చును… అంటే రూ.33 లక్షల భారీ విరాళాన్ని అందించారు @naralokesh, బ్రాహ్మణి దంపతులు. అంతేకాకుండా దేవాన్ష్ పేరున టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈరోజు రాష్ట్రమంతటా అన్నదానం చేస్తున్నారు,” అని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.
ఈరోజు నారా లోకేష్ కదిరి నియోజకవర్గంలో 48వ రోజు యువగళం పాదయాత్రలో ఉన్నందున, కుమారుడు పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనలేకపోయారు. కానీ మొటుకుపల్లి వద్ద ఆర్టీడీ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగుల ఆశ్రమపాఠశాలను సందర్శించి, అక్కడి పిల్లలకు మిటాయిలు పంచి వారితో కాసేపు సంతోషంగా గడిపారు. కుమారుడు పుట్టిన రోజు సందర్భంగా దారిలో శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని కొడుకు పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం పక్కనే అన్నా క్యాంటీన్‌ని ప్రారంభించారు.
Kamiya Jani has been a popular face on social media for her way of interacting…
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…