రాత మారిన బుద్ది మారదా..?

వైసీపీ పార్టీకి ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అవకాశాన్ని అభివృద్ధికి కాకుండా విధ్వంసానికి వాడారు జగన్. అయితే గడిచిన ఐదేళ్లుగా ప్రతిపక్ష పార్టీ నేతల మీద, ఆ పార్టీ క్యాడర్ మీద అధికార పార్టీ నేతలు చేయని అరాచకాలు లేవు అని చెప్పడానికి ఎన్నో సంఘటనలు సాక్ష్యాలుగా ఇప్పటికి కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయి.

అయితే ఈ ఐదేళ్ల వైసీపీ అరాచక పాలనకు తమ ఓటు అనే ఆయుధంతో అడ్డుకట్ట వేశారు ఏపీ ఓటర్లు. ఓటు తో ప్రజలు వైసీపీ రాత మార్చిన వారి బుద్ది మారడం లేదంటూ టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. కర్నూల్ టీడీపీ నేత గౌరినాధ్ దారుణ హత్య పై స్పందించిన లోకేష్, ఓడిపోయినా జగన్ రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారంటూ దుయ్యబట్టారు.

ADVERTISEMENT

వైసీపీ ఫ్యాక్షన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు జగన్ ను ఛీ కొట్టినా ఇంకా బుద్ది రాలేదన్నారు. సొంత బాబాయిని చంపిన మాదిరిగానే జనాల్ని కూడా జగన్ అంతమోదిస్తున్నాడు. ఇక్కడితో జగన్ తన హత్య రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రానున్న రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు అంటూ హెచ్చరికలు పంపారు లోకేష్.

అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ కార్యకర్తలకు బీపీ లు వస్తే దాడులకు తెగబడతారు అంటూ హింసను ప్రోత్సహించిన జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా టీడీపీ, జనసేన కార్యకర్తలను రెచ్చకొడుతూ దాడులకు పురికొల్పుతున్నారు. వై నాట్ 175 అంటూ విర్రవీగిన వైసీపీ కి వై నాట్ 11 అంటూ బదులిచ్చారు ఏపీ ప్రజానీకం.

అయినా అసలు తప్పెక్కడ జరిగిందో అనే దాని మీద సమీక్షలు చేసుకోకుండా ఇంకా రెచ్చకొడతాం, రెచ్చిపోతాం అంటే ఇప్పుడు టీడీపీ ప్రతిపక్ష స్థానంలో లేదనేది జగన్ గ్రహిస్తే ఇప్పటికైనా పార్టీకి మేలు చేసిన వారవుతారు. లేక ఇదే ధోరణితో వైసీపీ అండ్ కో మొండిగా ముందుకెళితే లోకేష్ హెచ్చరిస్తున్నట్లు వైసీపీ మాత్రమే కాదు జగన్ కూడా రాజకీయాల నుండి కనుమరుగు కాకతప్పని పరిస్థితులు తలెత్తుతాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Mrunal Thakur Says No, But What Is She Waiting For?

Mrunal Thakur has not signed a new film in nearly nine months. However, it is…

20 minutes ago

Rohit Back as MI Cap? Truth Behind Big Rumours

Mumbai Indians have reportedly shut down rumours of Rohit Sharma returning as captain for IPL…

50 minutes ago