
ఓటమి భాద తెలిస్తేనే గెలుపు విలువ అర్దమవమవుతుంది అనేది లోకేష్ విషయంలో స్పష్టంగా రుజువయ్యింది. మాజీ ముఖ్యమంత్రి మనవుడిగా, తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సమయంలో రాజకీయ రంగ ప్రవేశం చేసిన లోకేష్ గెలుపు నల్లేరు మీద నడకలా ఉండి ఉంటే లోకేష్ లో గెలుపు మీద ఇప్పటి పట్టుదల, కసి కచ్చితంగా ఉండేది కాదు.
ఆ ఓటమి అవమానాన్ని ఎదుర్కున్నాడు కాబట్టే గెలవాలన్న కసి పెరిగి యువగళం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యారు లోకేష్. అయితే తన యువగళాన్నిపూర్తి చేసుకున్న లోకేష్ తాజాగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో మాట్లాడుతూ తానూ పోటీ చేయబోయే స్థానంతో పాటుగా తానూ సాధించే మెజారిటీని కూడా వెల్లడించారు.
విమర్శించిన వారి నుండే ప్రశంసలు పొందినట్లుగా, ఓడిన దగ్గరే తన బలాన్ని, పార్టీ జెండాను నిలబెట్టాలని ఆశపడుతున్నారు లోకేష్. వచ్చే ఎన్నికలలో మంగళగిరి నుండే పోటీ చేస్తానని, 50 వేల మెజారిటీతో ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలలో మూడు వారాల ముందు నిర్ణయించుకుని ఎన్నికల బరిలో దిగడం జరిగిందని దాని వల్లనే గ్రౌండ్ లెవెల్ వరకు చేరుకోవడానికి తమకు సమయం లేకపోయిందని చెప్పారు.
మంగళగిరిలో పసుపు జెండా ఎగరేసి చాలాఏళ్లు గడిచిందని, అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఈ నియోజకవర్గాన్ని రానున్న ఎన్నికలలో టీడీపీ పార్టీకి కంచుకోటగా మార్చడానికి లోకేష్ అన్ని విధానాల పార్టీని, పార్టీ క్యాడర్ ను సిద్దంచేసినట్టు సమాచారం. గడిచిన నాలాగున్నరేళ్లుగా తనను ఓడించిన నియోజకవర్గ ప్రజలకు చేరువగా ఉంటూ స్థానిక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ సమస్య పరిష్కరానికి తన వంతుగా పార్టీ నుండి చేయవలసిన కార్యక్రమాలు అన్ని చేస్తూ స్థానిక ప్రజలలో నమ్మకాన్ని సంపాదించున్నారు లోకేష్. అదే నమ్మకంతో గెలుపుతో పాటు తన మెజారిటీ మీద కూడా ధీమా వ్యక్తం చేశారు నారా లోకేష్.
A Reddit post has gone viral for claiming that the cybersecurity firm Fortinet has laid…
An Indian F-1 student finds herself in serious trouble. A misunderstanding at Walmart has left…