
వైసీపీ అధినేత సిద్ధం అంటూ ఎన్నికల శంఖారావం పూరించే ముందుగానే వైసీపీ సోషల్ మీడియా తమ రాజకీయ ప్రత్యర్థుల పై విష ప్రచారానికి సిద్దమయ్యింది. గడిచిన రెండు రోజుల నుండి వైసీపీ సోషల్ మీడియా నారా లోకేష్ పై తప్పుడు వార్తలు రాస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంది.
ఈ రోజు తన ఎంట్రీ తో వైసీపీ సోషల్ మీడియా టీమ్ కి ఆ ఆనందాన్ని దూరం చేసారు నారా లోకేష్. అసలు విషయానికి వస్తే..,అమెరికాకు వెళ్లిన నారా లోకేష్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయ్యి అమెరికా జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు అంటూ వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా ప్రచారం చేసింది.
ఆ ప్రచారాలకు బలం చేకూరేలా వైసీపీ ఎన్నారై టీమ్ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర అమరవీరుల చిత్ర పటాలకు నివాళ్లు అర్పిస్తున్న కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు లోకేష్. దానితో భారత గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి నారా లోకేష్ తో పాటు ఆంధ్రా పోలీసులు కూడా అమెరికాకు వెళ్ళారా..? అంటూ కౌంటర్ వేశారు టీడీపీ శ్రేణులు.
ఇప్పుడు నారా లోకేష్ హైద్రాబాద్ నుండి విజయవాడ వస్తున్న నేపథ్యంలో గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కొందరు మీడియా మిత్రులు మిమ్మల్ని అమెరికా పోలీసులు అరెస్టు చేసారంటూ వైసీపీ ప్రచారం చేస్తుంది కదా దాని పై మీ స్పందన తెలియ చేయమని అడిగారు. దాని పై స్పందించిన లోకేష్ వైసీపీ కి తన స్టైల్ లో గట్టి కౌంటరే వేశారు.
“మనీ లాండరింగ్ కేసులో అరెస్టు చేసింది ఎవరిని? జగన్ నా? జగన్ కూరుతుని నా? భారతి రెడ్డి గారి నా?” అని మీడియా వారి పై ఎదురు ప్రశ్న వేశారు. మరి వైసీపీ సోషల్ మీడియా మిమ్మల్ని ట్రోల్ చేస్తోంది కదా సార్ అంటే..,అయితే వెళ్లి “ఆ గాడిదలనే అడగండి” అంటూ బదులిచ్చారు. వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినోడిని అడుగమ్మా, నన్నెందుకు అడుగుతున్నావ్, సమాధానం సరిపోయిందా..? అంటూనే వైసీపీ కి కౌంటర్ వేశారు లోకేష్.
తానూ గెలవడానికి విలువలను పక్కన పెట్టి, విశ్వసనీయతను గాలికొదిలి తప్పుడు వార్తలనే నమ్ముకుని రాజకీయాలు చేయడమే వైసీపీ లక్ష్యం అన్నట్టుగా ముందుకెళ్తున్న జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు గన్నవరంలో లోకేష్ చెప్పిన సమాధానం తో “కౌంటర్ సరిపోయిందా బ్రదర్” అంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా లో జగన్ ను ట్రోల్ చేస్తున్నారు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…