
రాజకీయపార్టీలు అధికారంలో ఉంటే ఏం చేయాలి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నలకు సామాన్య ప్రజలు సైతం సమాధానం చెప్పగలరు.
అలాంటిది వైసీపీని స్థాపించి, ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చి, అదే చేత్తో ఓడించుకున్న దాని అధినేత జగన్మోహన్ రెడ్డికి తెలియదా?అంటే తెలుసనే అనుకుంటాము.
కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా వ్యూహాలు… ఆ పేరుతో కుట్రలు, దుష్ప్రచారాలు, శవరాజకీయాలు, బాలీవుడ్ ప్రదర్శనలు, సంక్షేమ పధకాల పేరుతో ఓటు బ్యాంక్ రాజకీయాలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. నేటికీ అదే పద్దతిలో ముందుకు సాగుతున్నారు. దీనికి మరో తాజా ఉదాహరణ…
ముందుగా ఓ చిన్న ఫ్లాష్ బ్యాక్: ఇటీవల మహారాష్ట్ర డెప్యూటీ సిఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన ప్రయాణించిన విమానం వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థకు చెందినది.
బోడి గుండుకు మోకాలుకు ముడివేసినట్లు జగన్ మార్క్ రాజకీయాలు ఏవిధంగా ఉంటాయో మంత్రి నారా లోకేష్ నేడు మీడియాకు వివరించారు.
హెరిటేజ్ ఫిన్ లీస్ సంస్థ 1996లో స్థాపించబడింది. వివిధ సంస్థలకు రుణాలు ఇస్తుంటుంది. ఇది దీని వ్యాపార స్వభావం. దీని నుంచి 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ కొంత రుణం తీసుకుంది.
అప్పుడు మేము (టీడీపి) ప్రతిపక్షంలో ఉన్నాము. మేము 2024లో అధికారంలోకి వస్తామని, ఆ తర్వాత రామ్మోహన్ నాయుడు పౌరవిమానయానశాఖ మంత్రి అవుతారని మాకు ఎలా తెలుస్తుంది?అజిత్ పవార్ అదే విమానం ఎక్కి ప్రయాణిస్తారని మాకు ఎలా తెలుస్తుంది? అయన ఎక్కిన విమానం ప్రమాదానికి గురవుతుందని ఆయనకే తెలియనప్పుడు మాకెలా తెలుస్తుంది?
కానీ ఆ రెండు సంస్థల మద్య ఆర్ధిక లావాదేవీలతో ఈ విమానా ప్రమాదాన్ని… దాంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని, హెరిటేజ్ సంస్థని… దాంతో మా కుటుంబాన్ని ముడిపెట్టేసి జగన్ రెడ్డి మాపై బురద జల్లుతున్నారు.
నాడు బాబాయ్ వివేకాను దారుణంగా హత్య చేసి కత్తిని మా చేతిలో పెట్టేసినట్లే, ఈ విమానా ప్రమాదాన్ని మాతో ముడిపెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నారు,” అని మంత్రి నారా లోకేష్ వివరించారు.
ముందే చెప్పుకున్నట్లు జగన్ ఎల్లప్పుడూ వ్యూహాలు, కుట్రలు, దుష్ప్రచారాన్నే నమ్ముకున్నారు. ఇదే రాజకీయం అనుకుంటున్నట్లున్నారు. శాసనసభ సమావేశాలకు, ప్రజల మధ్యకు వెళ్ళకుండా, తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ప్రెస్‌మీట్‌లు పెట్టి పనిచేస్తున్న ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే, ఈవిధంగా దుష్ప్రచారం చేస్తుంటే ప్రజలు హర్షిస్తారా?ఈ పద్దతిలో ఎన్నికలలో గెలుపు సాధ్యమేనా? అని జగన్ ఒకసారి ఆలోచించి ఉండి ఉంటే, నేడు ఆయన శాసనసభలో, ప్రజల మద్యన ఉండేవారు.
NTR fans are growing anxious about Trivikram’s ambitious mythological project, tentatively titled God of War,…
Team India started the T20I series against West Indies with a complete performance in Lucknow.…