
43 రోజుల టీడీపీ నేతల నిశ్శబ్దం,ఆవేశం ఎట్టకేలకు టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ బద్దలుకొట్టారు. చంద్రబాబు అరెస్టుతో ఎక్కడికక్కడ ఆగిపోయిన టీడీపీ పార్టీ కార్యక్రమాలు నవంబర్ 1 నుండి రాష్ట్రంలో తిరిగి మొదలుపెట్టాలని పార్టీ నేతలకు, ఇంచార్జ్ లకు లోకేష్ పిలుపునిచ్చారు.
ఒక పవిత్రమైన ఆశయంతో మొదలు పెట్టిన “బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ” కార్యక్రమాన్ని తిరిగి ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. జగన్ సైకో పాలన నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఏపీ నుండి ఈ సైకో ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేసారు.
జగన్ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు.రాష్ట్రంలో ఒక విజిల్ వేసిన కేసు, ఒక కొవ్వొత్తు పట్టుకున్నాకేసు,గంట కొట్టినా కేసు, మన చేతులకు మనమే సంకెళ్లు వేసిన కేసు ఇలా టీడీపీ నేతల పై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూసిన భయం అనేది మన పార్టీ బయో డేటాలోనే లేదు అని వైకాపా గుర్తుపెట్టుకోవాలంటూ లోకేష్ హెచ్చరించారు.
తప్పుడు ఆరోపణలతో, అక్రమ కేసులు పెట్టి బాబుని జైలుకు పంపిన జగన్ ఒక సైకో అని, దీనికి కచ్చితంగా రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం సరైన సమాధానం చెప్తుందని, ఈ సైకో ప్రభుత్వం వలన ఇబ్బంది పడిన ప్రతి కుటుంబానికి న్యాయం చేసే గ్యారంటీ నాది అంటూ టీడీపీ కార్యకర్తలలో భరోసా నింపారు. 2019 లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైకాపా ప్రజల కోసం నిర్మించిన ప్రజా వేదికను కూల్చడంతో మొదలు పెట్టిన తన పాలనను రాజధాని అమరావతి కూల్చివేతతో కొనసాగిస్తూ ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి ఏకంగా రాష్ట్రాన్నే కూల్చడానికి సిద్ధమయ్యారు అంటూ లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేసారు.
బాబుని అరెస్టు చేసి జగన్ తన గొయ్యను తానే తవ్వుకున్నట్లయింది. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మచ్చ కూడా అంటించుకొని చంద్రబాబు పై 27 కోట్లు అవినీతి చేసారంటూ నిరాధారమైన ఆరోపణలు చేసి జగన్ చాల పెద్ద తప్పే చేశారు. దీనికి కచ్చితంగా రాబోయే కాలంలో సరైన సమాధానం టీడీపీ ప్రభుత్వం చెప్పి తీరుతుందని జగన్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు చేశారు.
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ అధికారం కోసం రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి చివరిగా అధికారం దక్కంచుకున్నాక అదే రాష్ట్రానికి భస్మాసురుడి మాదిరి తయారయ్యారంటూ లోకేష్ జగన్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలే చేశారు.అలాగే బాబు అరెస్టు నిర్ణయంతో తన పార్టీ పాలిట కూడా జగన్ భస్మసారుడిగా మారిపోయారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి,రాజకీయ కక్ష సాధింపులతో ప్రతిపక్ష నేతల పై కేసులు మోపి, “జే” టాక్స్ లతో పెట్టుబడి దారులను భయపెట్టి పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయేలా చేసి,రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని నిలబెట్టి న కారణంగానే జగన్ ను లోకేష్ భస్మాసురుడితో పోల్చరేమో అంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
Vijay Deverakonda has an interesting history at the box office with Rajinikanth. On two previous…
Crazy Kalyanam stars VK Naresh, Anupama Parameswaran, Tharun Bhascker and Akhil Uddemari of Raju Weds…