ఇంతకీ అవినీతి జరిగిందా? సృష్టించారా?

ఢిల్లీ నుంచి రాష్ట్రానికి వచ్చిన లోకేష్ ఈరోజు తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి తో పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని పిచ్చి జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో మూడు వేల కోట్ల అవినీతి జరిగిందంటూ చంద్రబాబుని అరెస్ట్ చేసిన వైసీపీ ప్రభుత్వం తరువాత దానిని మూడు వందల డబ్భై కోట్లుగా మాట మార్చి ఇప్పుడు ఇరవై ఏడూ కోట్లుగా పేర్కొన్నారు. ఇలా రోజుకో మాట పూటకో రాత రాస్తూ ఆధారాలు లేని ఆరోపణలు చేసి నిజాయితీకి సంకెళ్లు వేసింది ఈ ప్రభుత్వం అంటూ మీడియా సాక్షిగా వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను లోకేష్ ప్రజలకు వివరించారు.

ADVERTISEMENT

వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఈ పిచ్చి జగన్ చేస్తున్న ఈదురాగతాలకు తప్పకుండా తిరిగి సమాధానం చెప్పే రోజు తొందరలోనే ఉంది అంటూ టీడీపీ తమ్ముళ్లకు భరోసా ఇచ్చారు. తమ కుటుంబం ఎప్పుడు నీతి – నిజాయితీలతో ముందుకెళ్తుందని అవే తమ బలం . అన్నారు. రోజులు గడిచేసరికి అవినీతి కేసులో అంకెల సంఖ్య తగ్గుతూ రావడం ప్రభుత్వ వాదనలో నిజాయితీని ప్రశ్నిస్తుంది. చివరికి అసలు అవినీతే జరగలేదు అని చెప్పే రోజు కూడా అతి తొందరలోనే వస్తుందని లోకేష్ బలంగా చెప్పడం టీడీపీ శ్రేణులకు కొంత ఊరట కలిగించే అంశం.

న్యాయం గెలవడానికి కొంత సమయం పడుతుందేమో కానీ కచ్చితంగా న్యాయమే గెలుస్తుంది, చంద్రబాబు నిజాయితీకి మరకలు అంటిచడం జగన్ తరం కాదన్నారు లోకేష్. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను గమనిస్తున్న ప్రజలకు మాత్రం ఇంతకీ చంద్రబాబు కేసులో ప్రభుత్వం చెపుతున్నట్టు అవినీతి జరిగిందా? లేక ప్రభుత్వమే అవినీతిని కేసుని సృష్టించిందా?అన్న సందేహం రాకమానదు. ఎందుకంటే 3000 వేల కోట్ల నుంచి 370 కోట్లకు 370 కోట్ల నుండి 27 కోట్లకు ఇలా స్టాక్ మార్కెట్ కంటే దారుణంగా అంకెల గారడీ చేస్తున్న ఈ ఆరోపణలలో నిజమెంతా? అంటూ సామాన్య ప్రజలలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?

Anand Deverakonda and Vaishnavi Chaitanya’s Epic is facing brutal trolling after its OTT premiere on…

28 minutes ago

ఆంధ్రాలో ఎవరి ఓట్లు పోలేదా?ఇంత సైలన్స్.. జెన్-జీ ఎక్కాడ?!

దేశంలో లక్షలాది ప్రజల ఓట్లు ‘చోరీ’ అయ్యాయంటూ సీజేపీ, కాంగ్రెస్‌ మిత్రపక్షాల అధ్వర్యంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ రాజీనామాకు పట్టుబడుతూ…

58 minutes ago