
మళ్ళీ మనం పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల నమ్మకం పొందాలంటే ఎంతగానో శ్రమించాల్సి ఉంటుంది. ప్రజలు జగన్‌ను నమ్మి అధికారం అప్పజెప్పితే, రాష్ట్రాన్ని చూసి అందరూ జాలిపడే దుస్థితికి, ప్రభుత్వాన్ని చూసి అందరూ భయపడే పరిస్థితికి తీసుకువచ్చేశారు. హైదరాబాద్‌లో మొన్న ఎకరం రూ.100 కోట్లు పలికింది. అది కులం వలనా… మతం వలనా?
కేవలం హైదరాబాద్ అభివృద్ధి సాధించడం వలననే కదా?తెలంగాణ గురించి పత్రికలు, టీవీలలో నిత్యం అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించే ఎక్కువగా వార్తలు వస్తుంటాయి. కానీ మన ఏపీ గురించి ఏమి వార్తలు వస్తుంటాయో అందరికీ తెలుసు. ఏ కులం, మతం చూసి అన్ని కంపెనీలు హైదరాబాద్, బెంగళూరుకు తరలివెళ్ళిపోతున్నాయి?కొత్తగా పరిశ్రమలను తీసుకురాకపోగా ఉన్నవాటిని వేధించి రాష్ట్రం విడిచి పారిపోయేలా చేశారు.
జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిచేసి ఉండి ఉంటే నేడు ఏపీ కూడా అదేవిదంగా అభివృద్ధి చెంది ఉండేది. కానీ రాష్ట్రానికి గర్వకారణంగా నిలవాల్సిన అమరావతిపైనే జగన్ కులం ముద్రవేసి పాడుబెట్టి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ప్రజల మద్య కులం, మతం, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టారు.
ప్రజలు కోరుకొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇదేనా?అందరూ ఆలోచించాలి. రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణపనులు మొదలుపెట్టి యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తాము. అమరావతిలో రిజర్వ్ జోన్ రద్దు చేసి మళ్ళీ జీవో 41ని అమలుచేస్తాం. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులందరూ ఇంతకాలంగా అనుభవిస్తున్న మానసిక క్షోభని తీర్చి వారికి పూర్తి న్యాయం చేస్తాం.
అమరావతి నిర్మాణపనులు మొదలుపెట్టడంతో పాటు మళ్ళీ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంపై నమ్మకం కల్పించి పరిశ్రమలను, ఐటి కంపెనీలను రప్పిస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తాం,” అని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
Hanuman Ansh created a sensation at the Hindi box office, but its Telugu-dubbed version has…
ప్రధాని మోడీ అదివారం చెన్నైలో పర్యటించారు. తమిళనాడులో రూ.13,000 కోట్లు విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. తర్వాత చెన్నై…