కర్నూలులో హైకోర్టు బెంచ్: ఈ శుభదినం కోసమే ఎదురుచూపులు!

నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు (ఏఎంసీఏ)కి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి సిఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లు పెట్టుబడితో 650 ఎకరాలలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఏఎంసీఏలో యుద్ధ విమానాలు తయారు చేస్తారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ సీమ ప్రజలు ఎన్నేళ్ళుగానో ఎదురుచూస్తున్న తీపి కబురు చెప్పారు. త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు కాబోతోందని చెప్పారు. దీని ఏర్పాటు కోసం శరవేగంగా పనులు జరుగుతున్నాయని త్వరలోనే దీనికి సంబంధించి శుభవార్త వినిపిస్తానని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.

ADVERTISEMENT

గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు రాజధానులంటూ 5 ఏళ్ళు కబుర్లు చెప్పి కాలక్షేపం చేసి దిగిపోయారు తప్ప కనీసం హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేయలేదు.

మూడు రాజధానుల పేరుతో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని జగన్‌ చెప్పుకున్నప్పటికీ, ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధాని’ అని కట్టుబడి ఉన్న టీడీపిని, దాంతో కలిసి పనిచేస్తున్న జనసేనకి వ్యతిరేకంగా ఈ ప్రతిపాదనతో మూడు ప్రాంతాల ప్రజలను రెచ్చగొట్టి రాజకీయంగా దెబ్బ తీయాలనేదే ప్రదానోదేశ్యంగా కనిపిస్తోంది.

కానీ మూడు ప్రాంతాల ప్రజలు ఈ ప్రతిపాదనపై పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. దాంతో విశాఖ రాజధాని అంటూ టీడీపికి మంచి పట్టున్న ఉత్తరాంద్ర జిల్లాలలో దెబ్బ తీయాలనుకున్నారు. కానీ అదీ ఫలించలేదు.

ఒకవేళ ఈ జగన్‌ ఐడియాలు ఫలించి మూడు రాజధానులు లేదా విశాఖ రాజధాని ప్రతిపాదనలకు ప్రజలు మద్దతు పలికి ఉండి ఉంటే టీడీపి, జనసేనలు తుడిచి పెట్టుకుపోయేవేమో?

కానీ ఈ ప్రతిపాదనలలో జగన్‌లో చిత్తశుద్ధి కంటే రాజకీయ దురాలోచనలే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు పసిగట్టి తిరస్కరించడంతో టీడీపి, జనసేనల కోసం తవ్విన గోతిలో వైసీపీయే పడి దెబ్బతింది.

సిఎం చంద్రబాబు నాయుడు మూడు రాజధానులు చేస్తామని చెప్పలేదు. కానీ రాష్ట్రంలో మూడు ప్రాంతాలను సమానంగా, ఇంకా చెప్పాలంటే ఒక ప్రాంతంతో మరో ప్రాంతం అన్ని విధాల పోటీ పడుతున్నట్లుగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు.

శ్రీకాకుళంలో మూలపట్నం పోర్టు, విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, విశాఖలో గూగుల్, ఉమ్మడి గోదావరి జిల్లాలకు పోలవరం, ఉమ్మడి కృష్ణా జిల్లాలలో భవ్యమైన రాజధాని అమరావతి, సీమ జిల్లాలలో స్టీల్ ప్లాంట్‌, హైకోర్టు బెంచ్, డ్రోన్ సిటీ, ఇప్పుడీ యుద్ధవిమానాల ప్రాజెక్ట్ వంటివి చూస్తునప్పుడు చిత్తశుద్ధి, దూరదృష్టి ఉంటే ఏదైనా సాధ్యమేనని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపిస్తున్నారు కదా?

నారా లోకేష్‌ యువగళం పాదయత్ర చేస్తున్నప్పుడే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. జూన్‌ 12న సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి చేస్తున్న కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. కనుక జూన్‌ 12న కర్నూల్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి శంకుస్థాపన చేసే ఆలోచనలో ఉన్నారేమో?

https://twitter.com/M9News_/status/2055178436847800403?ref_src=twsrc%5Etfw 

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Rishabh Out: SRH Star In? Test Comeback Loading

Ishan Kishan could be back in India’s Test plans ahead of the upcoming New Zealand…

18 minutes ago

Pics: Kangan Turns Silver Style Into Pure Glamour

Kangan Baruah brings a flash of metallic glamour to this striking portrait series. Her silver…

38 minutes ago