‘జగన్’ రాజ్యంలో ‘కుప్పం’ వాస్తవ్యులు…!

తాడేపల్లిలో నేను ఇల్లు కట్టుకున్నాను…ఏపీ రాజధాని అమరావతినే…నన్ను నమ్మండి…ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ తండ్రి లేని బిడ్డ చేసిన అభ్యర్థనను నమ్మి 2019 ఎన్నికలలో వైసీపీ పార్టీ కి 151 సీట్లు కట్టబెట్టారు ఏపీ ప్రజలు.

ADVERTISEMENT

అయితే ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి మూడు రాజధానులు అంటూ 2024 లో రాష్ట్రంలో మూడో స్థానానికి పడిపోయారు జగన్. అయితే గత ఐదేళ్లుగా తాడేపల్లి ప్యాలస్ కేంద్రంగా రాజకీయాలు నడిపిన జగన్ తాడేపల్లిని తన రాజ్యంగా భావించారు.

ప్రజలు రాజు దగ్గరకు రాకుండా భటులను అడ్డుపెట్టుకున్నట్టు జగన్ కనీసం తన ప్యాలస్ కు వెళ్లే దారిలోకి కూడా ఎవరిని అడుగుపెట్టకుండా పోలీసులను, బారిగేట్ లను అడ్డుపెట్టుకుని తనను తానూ ఒక మహారాజు మాదిరి ఊహించుకున్నారు.

అయితే ఇప్పుడా రాజ్యంలోకి కుప్పం వాస్తవ్యులు నారా లోకేష్ గెలుపుతో అడుగు పెట్టడంతో రాజ్యాలు కూల్చలేకపోయిన రాజ్యానికి వెళ్లే మార్గాలను కూల్చారు లోకేష్. జగన్ ప్యాలస్ కు వెళ్లే దారిని ఇంతవరకు తన సొంతానికి వాడుకున్న జగన్ కు అది జగన్ తండ్రి గారి ఆస్తి కాదని, అది ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన మార్గమని తెలియచెప్పి ఆ మార్గాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

దాదాపు నాలుగు దశబ్దాల పాటు గెలుపు అన్న పదానికి అర్ధం తెలియని, కనీసం పార్టీ జెండా మోసే నాయకుడు లేని ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ టీడీపీ జెండా ఎగరేసి నారా వారి చరిత్రను రాష్ట్రానికి నిరూపిస్తా అంటూ పట్టినపెట్టును 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి పై సుమారు 91 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి మంగళగిరిని టీడీపీ కంచుకోటగా చేసి చూపించారు లోకేష్.

తాడేపల్లిలోనే కాదు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న జగన్ సామాజిక వర్గాన్ని సైతం టీడీపీ మద్దతుదారులుగా చేసుకోగలిగారు లోకేష్. అదే నియోజకవర్గమైన ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్నారు. అలాగే అదే మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా నివాసమేర్పాటు చేసుకున్నారు.

ఇటువంటి అత్యంత కీలకమైన స్థానంలో వైసీపీ గత ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా తన పట్టును పెంచుకోలేకపోయింది. కానీ వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ లోకేష్ ఎక్కడికి పారిపోలేదు. అక్కడే పడ్డాడు అక్కడే నెగ్గాడు. ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు ప్రజల నమ్మకాన్ని కూటగట్టుకున్నాడు. ఇప్పుడు అదే ప్రజలు జగన్ ను కాదని లోకేష్ వైపు నిలబడేలా చేసుకున్నారు.

తానూ కూర్చున్న చెట్టు కొమ్మను తానే నరికేసుకున్నట్టు, తన పిల్లల్ని తానే తినేసినట్టు జగన్ కూడా తానూ నివాసముంటున్న ప్రాంతం భూమి విలువను మిగేస్తున్నారంటూ మండిపడుతున్నారు తాడేపల్లి వాస్తవ్యులు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తాడేపల్లిలో ఉన్న భూమి విలువ జగన్ ప్రభుత్వం రాగానే సగానికి కుచించుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక్కడ నారా లోకేష్ గెలుపొందడంతో మంగళగిరికి మహర్దశ పట్టినట్టే అంటున్నారు స్థానికులు. ఎక్కడో రాయలసీమ చిత్తూరు జిల్లాలో కుప్పం ప్రాంతం నుంచి వచ్చిన నారావారి కుటుంబం ఇక్కడి ప్రాంతం అభివృద్ధి గురించి తాపత్రయ పడుతుంటే ఇక్కడే పుట్టి పెరిగిన ఆళ్ళ రామకృష్ణ రెడ్డి ఈ ప్రాంత పతనాన్ని కోరుకుంటున్నారు అంటూ ఆర్కే పై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.

ఎవరైనా కష్టమని తలుపుతడితే అన్నగా అండగా నిలబడుతున్నాడు. వినతి పత్రాలు అందుకుంటూ స్థానిక సమస్యల పై అవగాహన పెంచుకుంటున్నారు, నేనున్నాను అనే భరోసా ఇస్తూ మంగళగిరి ప్రజలకు చాల దగ్గరయ్యారు లోకేష్. కుప్పం వాస్తవ్యలైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకపక్క, నియోజకవర్గ నాయకుడిగా నారా లోకేష్ మరోపక్క తాడేపల్లిలో తమ పట్టు పెంచుకుంటున్నారు. దీనితో “జగన్ రాజ్యంలో కుప్పం వాస్తవ్యులు” అంటూ వైసీపీకి స్థానికంగా సెటైర్లు పేలుతున్నాయి.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Forget Reels, Focus on Real Life: Suriya

Actor Suriya has a message for students who spend too much time making reels, focus…

29 minutes ago

అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ సీట్ల కోసం పట్టుబడితే ఎలా?

స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన 40 శాతం సీట్లకు పట్టుబడుతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్…

32 minutes ago