కేసీఆర్ కి వదినమ్మ కౌంటర్ పంచ్!

nara-lokesh-ghmcహైదరాబాద్ లో టీఆర్ఎస్ జెండా పాతడం ఖాయమని, కేసీఆర్ పాలనను ప్రత్యక్షంగా వీక్షించిన నగర వాసులు టీఆర్ఎస్ పార్టీకి తప్ప మరో పార్టీకి ఓటు వేయరని, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సతీమణి, తన వదిన భువనేశ్వరి గారు చాలా మంచి వారని, ఇటీవల పార్టీ నేతలు కొందరు కలిసిన సమయంలో తన ఓటు కూడా టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తానని భువనేశ్వరి అభయం ఇచ్చారని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

రాజకీయంగా దుమారంగా రేపిన ఈ వ్యాఖ్యలకు నారా వారబ్బాయి లోకేష్ బదులిచ్చారు. “తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను తన అమ్మ భువనేశ్వరితో చర్చించానని… టీఆర్ఎస్ కు ఓటు వేస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని తన తల్లి చెప్పినట్లుగా” లోకేష్ ట్వీట్ చేసారు.

ADVERTISEMENT

ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు గానూ కేసీఆర్ ఈ రకమైన ప్రకటనలు చేస్తున్నారని, చివరకు తెలుగుదేశం పార్టీకే రికార్డు విజయం అందుకుంటుందని, నా ఓటు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే” అని తన అమ్మ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పినట్లుగా లోకేష్ ట్వీట్లు చేసారు. బహిరంగ వేడుకపై కేసీఆర్ చేసిన ఈ విమర్శల ఉదంతాన్ని ఓ దురదృష్ట సంఘటనగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories