
మాజీ మంత్రి, టిడిపి యువనేత నారా లోకేష్ ఈరోజు తొలిరోజే మంగళగిరిలో నామినేషన్స్ వేశారు. టిడిపి నేతలు కార్యకర్తలతో పాటు జనసేన, బీజేపీల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకు ముందు నారా లోకేష్ మంగళగిరిలో సీతారామ ఆలయంలో స్వామివారి పాదాల చెంత నామినేషన్స్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 10వేల మంది వెంటరాగా నారా లోకేష్ ఊరేగింపుగా వెళ్ళి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి రాజకుమారికి అందజేశారు.
గత ఎన్నికలలో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపి అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికలలో వైసీపి ప్రభంజనం కారణంగా నారా లోకేష్ ఓడిపోయినప్పటికీ, మంగళగిరిని విడిచిపెట్టి వెళ్ళిపోకుండా నియోజకవర్గంలో పలు అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసులను గెలుచుకున్నారు.
మంగళగిరిపై నారా లోకేష్ పూర్తి పట్టు సాధించినందునే, జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డిని కాదని గంజి చిరంజీవిని మళ్ళీ ఆయనను కూడా పక్కన పెట్టి మురుగుడు లావణ్యని వైసీపి అభ్యర్ధిగా ప్రకటించారు. దీంతో ఆళ్ళ, గంజి మొదట్లో కొంత ఆవేదన చెందినప్పటికీ నారా లోకేష్ చేతిలో ఓడిపోకుండా తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తప్పించేసి తమ పరువు కాపాడారని సంతోషపడుతున్నారు. అంటే వైసీపి… దాని అభ్యర్ధులు ఎన్నికలకు చాలా ముందే మంగళగిరిలో ఓటమిని అంగీకరించేసారన్న మాట!
గత ఎన్నికలకు, ఈ ఎన్నికలకు మద్య నారా లోకేష్ అన్ని విదాలుగా రాటు తేలారు. యువగళం పాదయాత్రలో ఆయన జగన్మోహన్ రెడ్డిని, మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీసిన తీరు, ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధికి సంబందించి పలు అంశాలపై ఆయన కనబరిచిన సాధికారత చూసినప్పుడు ఈయననేనా మనం ఆనాడు పప్పు అంటూ ఎగతాళి చేసింది?అని వైసీపి నేతలే ఆశ్చర్యపోతున్నారు.
ఆనాడు పప్పు అనుకొన్న నారా లోకేషే ఇప్పుడు నిప్పు కణికలా మారి తమకు చురకలు వేస్తుంటే, వివిద అంశాలపై నిలదీసి ప్రశ్నిస్తుంటే జవాబు చెప్పలేక తడబడుతున్నారు.
ఇదీగాక ఈసారి టిడిపి, జనసేన, బీజేపీలు కలిసి పోటీ చేస్తుండటం, అమరావతి విషయంలో జగన్ అనాలోచిత నిర్ణయంతో స్థానికులలో ముఖ్యంగా రైతులలో వైసీపి పట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉండటం, వైసీపి ఆరాచాకాలు, బాదుడుతో ప్రజలు వేసారిపోయి ఉండటం వంటి అనేక అంశాలు నారా లోకేష్‌కు అనుకూలంగా మారాయి. అందుకే ఈ సారి చాలా భారీ మెజార్టీతో గెలుస్తానని ఖచ్చితంగా చెపుతున్నారు. అదే జరుగబోతోంది కూడా.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…