Telugu

నాడు సంక్షేమం.. నేడు అభివృద్ధి.. ఏది బెస్ట్?

నేను ముఖ్యమంత్రినయితే.. నేను ప్రధానినైతే.. అంటూ సామాన్య ప్రజలు కూడా ఏదో చేస్తామని చెపుతుంటారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఆయన కూడా తన బుర్రలో దాచుకున్న అనేక ఆలోచనలు అమలు చేశారు.

అయితే పరిశ్రమలు, ఐటి కంపెనీలు తెచ్చి వాటిలో ఉద్యోగాలు ఇప్పించి, రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించడం కంటే, సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు ఇస్తే చాలనుకున్నారు. అదే అభివృద్ధని అనుకున్నారు. త్రికరణ శుద్ధిగా కాకపోయినా సంక్షేమ పధకాలు 5 ఏళ్ళు అమలు చేశారు. వాటి వలన రాష్ట్రం అప్పుల పాలయింది తప్ప ప్రజల జీవన ప్రమాణాలు పెరగలేదు.

ADVERTISEMENT

సిఎం చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ది, పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు, ఉద్యోగాలు, ఉపాధి, మౌలిక వసతులు, టెక్నాలజీ… కనుక ఆయన ఆ దిశగా నడుస్తూ తన సంక్షేమ పధకాలను పట్టించుకోవడం మానేశారని జగన్‌ బాధపడని రోజు లేదు.

ఇంతకీ విషయం ఏమిటంటే, ఆ అభివృద్ధిలో భాగంగా నేడు మంత్రి నారా లోకేష్‌ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని శ్రీసిటీలో ప్రముఖ అంతర్జాతీయ కొరియన్ కంపెనీ ఎల్‌జీ కంపెనీకి శంకుస్థాపన చేశారు. రూ.5,000 కోట్లు పెట్టుబడితో ఏర్పాటు కాబోతోంది. దీనికి అనుబంధంగా మరో రూ.839 కోట్లు పెట్టుబడితో మరో 5 పరిశ్రమలు ఏర్పాటు చేస్తారు. వీటిలో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, వాషింగ్ మెషిన్ తదితర గృహోపకరణాలు తయారుచేస్తారు.

తొలి దశ ప్లాంట్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎల్జీ కంపెనీకి 188 ఎకరాలు కేటాయించింది. తొలిదశలో ఈ 5 ప్లాంట్స్ ద్వారా సుమారు 1 ,500 మందికి ప్రత్యక్షంగా, మరో 2-3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించబోతోంది.

మొదటి దశ ప్లాంట్‌ నిర్మాణం పూర్తిచేసి 1,500 మందికి ఉద్యోగాలు కల్పించి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత రెండో దశ ప్లాంట్‌ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో 70 ఎకరాలు కేటాయించేందుకు అంగీకరించింది.

కానీ సిఎం చంద్రబాబు నాయుడు బాధతలు చేపట్టగానే అటు చిత్తూరు నెల్లూరు నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాలలో ఇటువంటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. కనుక జగన్‌ పాలనకు, సిఎం చంద్రబాబు నాయుడు పాలనలో ఎంత తేడా ఉందో వచ్చే ఎన్నికల నాటికి స్పష్టంగా కళ్ళకు కనబడుతుంది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Ranabaali Under Pressure: Is Vijay Betting Too Much on the Trailer?

Vijay Deverakonda appears unfazed by the slow start to Ranabaali’s North American advance bookings. The…

23 minutes ago

GV Prakash’s Big Bollywood Test

GV Prakash Kumar has delivered several memorable albums in South Indian cinema, but Bollywood is…

52 minutes ago