
మీడియా వర్గాలు అడిగిన ఏ ప్రశ్నకైనా తడబడకుండా సమాధానం చెప్పే తీరులో లోకేష్ ఒకటికాదు చాలా మెట్లే ఎక్కినట్టు మరోసారి నిరూపించారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిఐడి విచారణ కొనసాగినప్పటికీ ఏమాత్రం విసుగు లేకుండా విలేకరులు అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిచ్చిన తీరు రాజకీయాలలో లోకేష్ పరిణితిని చాటి చెప్పింది.
విచారణలో సిఐడి ప్రశ్నలకు మీరు నీళ్లు నమిలారు అంటూ కొన్ని మీడియాలలో కథనాలు రావడం పై మీ స్పందన ఏంటి అంటూ అడిగిన ప్రశ్నలకు లోకేష్ సాక్షి, tv9 ,ntv , వీళ్ళు, వీళ్ళు …, అంటూ ఆ మూడు ఛానల్స్ మైకులు పైకి లేపి మరీ వీరు కాకుండా మరేమైనా ఛానల్స్ వేస్తే అందుకు నేను సమాధానము ఇస్తాను అంటూ పరోక్షంగా ఆ మూడు ‘బ్లూ’ మీడియాలు అనిఅర్ధం వచ్చేలా లోకేష్ ఇచ్చిన కౌంటర్ తో అక్కడ వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
మీ తండ్రిగారి కేసుల గురించి పురందరేశ్వరి ఢిల్లీ పెద్దలతో పైరవీలు చేస్తుంది అంటూ అంబటి చేసిన విమర్శల గురించిమీ స్పందన ఏంటి అంటూ అడిగిన వెంటనే అరగంటా- గంటా మంత్రి విమర్శలకు కూడా మనమేం సమాధానం చెప్తాం బ్రదర్ అంటూ స్పాంటేనియస్ గా లోకేష్ ఇచ్చిన జవాబుతో అందరు సరదాగా కాసేపు నవ్వులతో సేద తీరారు.
మీడియా ముందుకు వస్తే లోకేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాదిరి పంచ్ డైలాగ్స్ తో అధికార పార్టీ మీడియా వారిని ఒక ఆటాడుకోవడంలో సిద్దహస్తుడయ్యాడనే చెప్పాలి. ఏ అమ్మ సాక్షి రాలేదా? ఎనీ క్వషన్స్? అంటూ జగన్ పత్రికా విలేఖరిని సైతం పిలిచి మరీ అడిగిన విధానం లోకేష్ లోని ఆత్మ స్తైర్యాన్ని బయటపెడుతోంది.
అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ల గడిచినా ఇప్పటికి ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేక పోయిన జగన్ ‘వై నాట్ 175 ‘ , కాదు “వై నాట్ వన్ ప్రెస్ మీట్” జగన్ అంటూ నిలదీస్తే ఈ పులివెందుల పులి ఏ అడవిలో దాక్కుంటుందో అంటూ టీడీపీ శ్రేణులు వైసీపీ అధినేత పై ఛలోక్తులు వేసుకుంటున్నారు.
తండ్రి అరెస్టుతో, పార్టీలో ఏర్పడిన సందిగ్తతో, అధికార పార్టీ రచించే కుయుక్తులతో కుంగిపోకుండా అదే దూకుడుతో, ఆత్మ విశ్వాసంతో లోకేష్ వైసీపీ పన్నే పద్మ వ్యూహంలో టీడీపీ పార్టీ చిక్కుకుపోకుండా పార్టీని, పార్టీ అధినేతను తిరిగి ప్రజా క్షేత్రంలో నిలబెట్టగలరు అనే నమ్మకాన్ని పార్టీ శ్రేణులకు కలిగించడంలో లోకేష్ విజయం సాధించినట్టే!
India beat West Indies by 14 runs in the third T20I at the Holkar Stadium…
Rajinikanth's highly anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar is all set to hit…