
పాదయాత్రలో ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం అవుతూ, వైసీపీ నేతల అవినీతిని, ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి ప్రశ్నిస్తుంటే దేశముదురు వైసీపీ నేతలు కూడా సమాధానాలు చెప్పడానికి వెనుకంజవేస్తున్నారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు రాయలసీమలోనే 121 రోజుల పాటు యువగళం పాదయాత్రలో 1528కిమీ నడిచారు.
ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కర్నూలు న్యాయరాజధాని గురించి కూడా నారా లోకేష్ న్యాయవాదులతోనే ముఖాముఖీ మాట్లాడి టిడిపి వైఖరిని స్పష్టం చేశారు.
“రాష్ట్ర విభజనతో ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే చాలా చిన్నదైపోయింది. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో మనలో మనం కీచులాడుకొంటే నష్టపోయేది మనమే. రాష్ట్రంలో రాజధాని అమరావతి కేంద్రంగా పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ విధానంలో సీమ జిల్లాలకు అనేక పరిశ్రమలు తీసుకువచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు.
మన జిల్లాలు అభివృద్ధి చెందటమే కదా మనకు కావలసింది? మరి మూడు రాజధానులు దేనికి? పోనీ మూడు రాజధానులు అవసరమని చెపుతున్న జగన్ ప్రభుత్వం, రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లానైనా అభివృద్ధి చేసిందా?ఒక్క పరిశ్రమనైనా తీసుకువచ్చి ఉద్యోగాలు కల్పించిందా… లేదు కదా?
ఆనాడు అమరావతి రాజధానిగా ఒప్పుకొన్న సిఎం జగన్మోహన్ రెడ్డే అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ లబ్ధి కోసం మూడు రాజధానుల పేరుతో ప్రజలను, ప్రాంతాల మద్య చిచ్చుపెట్టి విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు మూడు రాజధానుల విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు కనుకనే ఈ నాలుగేళ్ళలో ఇక్కడ కర్నూలులో, అక్కడ విశాఖలో ఒక్క భవనం కూడా కట్టలేదు.
కర్నూలుని న్యాయరాజధాని చేస్తామని చెప్పిన జగనే నేషనల్ లా కాలేజీని కర్నూలు నుంచి అమరావతికి ఎందుకు తరలించిపోయారు? హైకోర్టు కర్నూలులో ఉంటే నేషనల్ లా కాలేజీ కూడా అక్కడే ఉండాలి కదా?జగన్ చెప్పేదొకటి చేసేదొకటి.
కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు. ఏమి చెపుతారో అది తప్పకుండా చేస్తారు. పరిపాలనా సౌలభ్యం కోసమే అన్నీ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆనాడే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేటికీ దానికి మా పార్టీ కట్టుబడి ఉంది. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కర్నూలులో యుద్ధ ప్రాతిపదికన హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అలాగే కడపలో స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలనే మీ ప్రతిపాదన గురించి కూడా నేను చంద్రబాబు నాయుడుగారితో మాట్లాడి నిర్ణయం తీసుకొంటాము,” అని విస్పష్టంగా చెప్పారు. నారా లోకేష్ ఈరోజు 121వ రోజున అన్నమయ్యజిల్లా రాజంపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు.
Vijay Deverakonda’s Ranabaali is heading towards release with a big overseas target, but the early…
After missing its October 9 release, Venkatesh and Trivikram’s Aadarsha Kutumbam AK47 was reportedly heading…