
ఈరోజు చంద్రబాబు నాయుడుని పరామర్శించి వచ్చిన టిడిపి యువనేత నారా లోకేష్, మీడియాతో మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడికి ఊరికే ఎన్ఎస్జి కమెండోలతో భద్రత కల్పించిందా?15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఆయనకు అనేకమంది శత్రువులు ఉంటారు. ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉన్నందునే కేంద్రం ఆయనకు ఎన్ఎస్జి కమెండోలతో భద్రత కల్పిస్తే దానిని జగన్ ప్రభుత్వం తొలగించడాన్ని ఏమనుకోవాలి?
రాజమండ్రి సెంట్రల్ జైలులో కరుడుకట్టిన నేరస్థులున్నారు. అటువంటివారి మద్య కేవలం లాఠీలతో ఉండే సాధారణ పోలీసులు ఏవిదంగా ఆయనకు రక్షణ కల్పించగలరు?జైల్లో చంద్రబాబు నాయుడుకి ఏదైనా జరిగితే దానికి సిఎం జగన్కు బాధ్యత వహిస్తారా లేక హోంమంత్రి బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.
టిడిపి, జనసేన కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయని, తమతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది ఆ పార్టీ పెద్దలే నిర్ణయించుకోవాలని నారా లోకేష్ చెప్పారు. ముందుగా టిడిపి, జనసేనలు కలిసి పనిచేసేందుకు కార్యాచరణ రూపొందించుకొంటున్నామని చెప్పారు.
చంద్రబాబు నాయుడు గతంలో ఐటి రంగానికి వేసిన పునాదుల మీదే నేడు హైదరాబాద్ నగరం అంతగా అభివృద్ధి చెందిందని, అటువంటి దార్శనికత కలిగిన తన తండ్రి చంద్రబాబు నాయుడుని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాని, కనీసం ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయలేని జగన్, కేవలం రాజకీయ కక్షతోనే జైల్లో పెట్టించి అవమానించారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందిస్తూ, “మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడుని కనీసం ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా అరెస్ట్ చేయడం రాజకీయకక్ష సాధింపు చ్చారయే అని స్పష్టంగా కనబడుతోంది. జగన్మోహన్ రెడ్డి ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈవిదంగా తప్పుడు కేసుతో అరెస్ట్ చేసింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము,” అని అన్నారు.
Elon Musk has become the first person in history to reach a trillion-dollar net worth,…
The Ramayana teaser has given audiences an idea of the scale Namit Malhotra is planning…