నారా లోకేష్‌ ఐ‌టి కంపెనీలు రప్పించగలిగితే….

ఏపీ ఐ‌టి, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్‌ శుక్రవారం అమెరికా ప్రయాణం అవుతున్నారు. అమెరికా, లాస్ వెగాస్‌లో ఈ నెల 29 నుంచి సినర్జీ సదస్సు జరుగబోతోంది. ఆ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు సాధించుకు వచ్చేందుకు నారా లోకేష్‌ బయలుదేరుతున్నారు. అమెరికాలో వారం రోజులు పర్యటించనున్నారు.

ADVERTISEMENT

ఈ సదస్సులో అమెరికాలోని ఐ‌టి రంగానికి చెందిన మూడు వేల పెద్ద, మద్య తరహా, చిన్న కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, స్టీవ్ ఫోర్బ్స్, కెవిన్ ఓ లియరీ, ఎఫ్‌డిఐసీకి చెందిన షిల బ్లేర్, ఓపెన్ ఏఐకి చెందిన జాక్ కాస్‌ తదితరులు ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు.

ఈ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణ కొరియా నుంచి ఓ బృందం వస్తోంది. వారిలో ది కొరియన్ ఎగ్జిమ్ బ్యాంక్ ప్రతినిధులు కూడా ఉన్నారు. ఆ బ్యాంక్ ఏపీలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దక్షిణ కొరియా బృందంతో నారా లోకేష్‌ సమావేశం కానున్నారు.

గత 5 ఏళ్ళుగా రాష్ట్రంలో అరాచక వాతావరణం నెలకొని ఉండేది. కనుక ఈ విదేశీ పర్యటనలో నారా లోకేష్‌ బృందం ప్రయత్నాలు ఫలించి, ఏపీకి ఐ‌టి కంపెనీలు తరలివస్తే రాష్ట్రంలో మార్పు మొదలయిన్నట్లే భావించవచ్చు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నా రాజకీయాలతోనే కాలక్షేపం!

ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్‌ యుద్ధ పరిణామాలు, హెచ్‌1బీ వీసాలు, గ్రీన్ కార్డుల జారీపై కొత్త ఆంక్షలు.. వీటన్నింటి ప్రభావం అమెరికాతో…

7 minutes ago

వల్లభనేనికి ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదే!

మాజీ వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 5నెలలు జైల్లో ఉండి వచ్చినా ఇంకా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన అనుచరులతో…

11 minutes ago